స్క్రిప్ట్ మీద ఇంత పట్టుగా కూర్చున్న హీరో అల్లుఅర్జున్ మళ్లీ తన నిబంధనలు కాస్త సడలించుకున్నట్లు కనిపిస్తోంది. త్రివిక్రమ్ తో చేయబోయే సినిమా సెకండాఫ్ స్క్రిప్ట్ రెడీ కాకుండానే సెట్ మీదకు వెళ్తున్నారు. ఈ స్క్రిప్ట్ విషయంలో దర్శకుడు త్రివిక్రమ్ ఇప్పటికి ఒకటికి రెండుసార్లు మార్పులు చేర్పులు చేసుకున్నట్లు బోగట్టా. ముందు అనుకున్న లైన్ కే కాస్త అటు ఇటు మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
ఇటీవల ఫస్ట్ హాఫ్ ఫుల్ నెరేషన్ ఇచ్చేసారు. కానీ సెకండాఫ్ ఫ్లో మాత్రమే చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆలస్యం అయినందున, బన్నీ వెనుక మరో రెండు కమిట్ మెంట్స్ వున్నందును, రెడీగా వున్న ఫస్ట్ హాఫ్ తో ఈనెల 23 లేదా 24 నుంచి సెట్ మీదకు వెళ్లిపోతున్నారు. ఒక పక్క ఫస్ట్ హాఫ్ చేస్తూనే, దర్శకుడు త్రివిక్రమ్ సెకండాఫ్ స్క్రిప్ట్ డెవలప్ చేసి, ఫైనల్ నెరేషన్ ఇస్తారని తెలుస్తోంది.
కథ మొత్తం చెప్పేసినందున, బన్నీ ఈ మేరకు అడ్జస్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇది పూర్తయిపోతే శ్రీరామ్ వేణు (వేణు శ్రీరామ్) బౌండ్ స్క్రిప్ట్ రెడీగా వుంది. దాన్ని ఫినిష్ చకచకా ఫినిష్ చేసేస్తారు. దానికి నిర్మాత దిల్ రాజు.