వివేకం వచ్చేసింది.. స్పైడర్ ఏం చూపిస్తాడో చూడాలి

“స్పైడర్‌ సినిమా జేమ్స్‌బాండ్‌ తరహాలో పూర్తిస్థాయి ఫ్యూచెరిస్టిక్‌ మూవీ కాదు. ప్రస్తుతమున్న పరిస్థితుల దృష్ట్యా ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ మన దేశంలో ఎలా పనిచేస్తుంది. వారు మన కోసం ఏం చేస్తున్నారు అనేవి సినిమాలో చూపిస్తున్నాం.…

“స్పైడర్‌ సినిమా జేమ్స్‌బాండ్‌ తరహాలో పూర్తిస్థాయి ఫ్యూచెరిస్టిక్‌ మూవీ కాదు. ప్రస్తుతమున్న పరిస్థితుల దృష్ట్యా ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ మన దేశంలో ఎలా పనిచేస్తుంది. వారు మన కోసం ఏం చేస్తున్నారు అనేవి సినిమాలో చూపిస్తున్నాం. ఇంటలిజెంట్ ఏజెంట్స్ ఎలా పనిచేస్తారో చూపిస్తూనే, సినిమాలో ఎమోషన్స్‌ ను కూడా చూపించాం.”

స్పైడర్ సినిమాకు సంబంధించి దర్శకుడు మురుగదాస్ ఇచ్చిన స్టేట్ మెంట్ ఇది. అయితే మురుగదాస్ ఏం చెప్పాడో సేమ్ టు సేమ్ అదే వివేకం సినిమాలో కూడా ఉంది. అజిత్ హీరోగా నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో, మురుగదాస్ చెప్పినట్టు ఇంటలిజెన్స్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూపించారు.

ఇంటలిజెంట్ ఏజెంట్ తో కొన్ని ఎమోషన్స్ కూడా పండించారు. ఇక స్పైడర్ తరహాలోనే సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్ కూడా వివేకంలో ఉంది. మరి ఇంతకుమించి స్పైడర్ లో కొత్తగా ఏం చూపిస్తారనేది ప్రశ్న.

కాకపోతే వివేకం సినిమాను అవివేకంగా తీశాడు దర్శకుడు శివ. స్పైడర్ సినిమాను మురుగదాస్ అంత సిల్లీగా తీస్తాడని అనుకోలేం. ఎందుకంటే ఇంతకుముందు మురుగదాస్ తీసిన చిత్రాలన్నీ కాస్త కంటెంట్ ఉన్నవే.

సో.. స్పైడర్ సినిమా టీజర్ విషయంలో తేలిపోయినా.. కంటెంట్ పరంగా కాస్త గట్టిగానే ఉంటుందని అంతా ఊహిస్తున్నారు. మరి ఇది మురుగదాస్ మార్క్ తోనే వస్తుందా.. లేక వివేకం-2 అనిపించుకుంటుందా అనేది చూడాలి.