మొత్తానికి నేనే రాజు నేనే మంత్రి సినిమా డైరక్టర్ తేజకు కమ్ బ్యాక్ ఫిల్మ్ మాత్రమే కాదు, కాస్త మంచి రాబడి కూడా తెచ్చి పెట్టింది. ఈ సినిమాకు సంబంధించి సుమారు అయిదు కోట్ల వరకు తేజ వాటాకు వెళ్తుందని బోగట్టా. తేజకే కాదు, నిర్మాతలయిన, కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి, దగ్గుబాటి సురేష్ బాబు, హీరో రానా లకు కూడా తలా అయిదు కోట్లు వస్తాయని తెలుస్తోంది.
నేనే రాజు నేనే మంత్రి సినిమాను చాలా అంటే చాలా రీజనబుల్ బడ్జెట్ లో ఫినిష్ చేసారు. తేజ లెక్కల ప్రకారం 11 నుంచి 12కోట్లు. నిర్మాతల లెక్కల ప్రకారం అన్ని ఖర్చులు కలుపుకుని, 16కోట్లు. సినిమాకు టోటల్ గా అన్నీ అంటే అన్నీ కలుపుకుని పాతిక కోట్ల వరకు లాభం వచ్చినట్లు తెలుస్తోంది. మందుగా అనుకున్న ఒప్పందం ప్రకారం పావలా వాటా తేజకు, పావలా వాటా రానా కు ఇవ్వాలి.
ఆ లెక్కల ప్రకారం కాస్త అటు ఇటుగా అయిదు కోట్ల వరకు తేజ ఖాతాకు వెళ్లాయట. రానాకు కూడా అలాగే. రానాకు బాహుబలి తరువాత వచ్చిన క్రేజ్ ప్రకారం ఇది పెద్ద మొత్తం కాదనుకోవాలి. కానీ గడచిన పదేళ్లుగా దర్శకుడు తేజకు వున్న ట్రాక్ రికార్డు ప్రకారం అయిదు కోట్లు పెద్ద మొత్తమే. ఇదే లాభాల్లో వాటా కాకుండా, రెమ్యూనిరేషన్ అయితే ఏ మూడు దగ్గరో ఆగి వుండేది అని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. ఏమైతేనేం, తేజ ఫుల్ హ్యాపీ.