‘రామయ్యా వస్తావయ్యా’ పరాజయం తర్వాత హరీష్ శంకర్ ఎక్కడా కనిపించడం లేదు. గబ్బర్‌సింగ్ తర్వాత హాట్ షాట్ డైరెక్టర్ అనిపించుకున్న హరీష్ ఒక్క ఫ్లాప్‌తోనే కొంచెం వెనక్కి వెళ్లాడు. అల్లు అర్జున్‌తో చేద్దామనుకున్న సినిమా కాస్తా కాన్సిల్ కావడంతో తన కథకి హీరో కోసం అతను అన్వేషిస్తున్నాడు. స్టార్ హీరోలంతా బిజీగా ఉండడంతో ఇప్పుడు హరీష్ ఎవరైనా యువ హీరోతో సినిమా చేద్దామని చూస్తున్నాడు.
సుబ్రమణ్యం ఫర్ సేల్ అనే సబ్జెక్ట్ రెడీ చేసిన హరీష్ ఆ సినిమాకి చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ అయితే బాగుంటాడని అనుకుంటున్నాడట. రేయ్ సినిమాతో పరిచయం కాబోతున్న సాయి ధరమ్ తేజ్‌కి ఇప్పటికే మరో రెండు ప్రాజెక్ట్స్ చేతిలో ఉన్నాయి. హరీష్‌శంకర్ సినిమా కూడా అతనికి ఓకే అయిందంటే తేజ్ హీరోగా సెటిల్ అయిపోతాడు.
అల్లు అర్జున్‌తో హరీష్ చేద్దామని అనుకున్న ప్రాజెక్ట్ ఇదేనట. తనకి త్రివిక్రమ్‌తో సినిమా ఓకే అయ్యేసరికి అల్లు అర్జున్ ఈ చిత్రాన్ని వదిలేసుకున్నాడు. సాయి ధరమ్ తేజ్‌తో హరీష్ ప్రాజెక్ట్ ఓకే అయ్యేదీ లేనిదీ మరి కొద్ది రోజుల్లో తెలుస్తుంది. ఇద్దరు సూపర్‌స్టార్స్‌తో సినిమాలు చేసిన తర్వాత తేజ్‌తో సినిమా చేయడానికి సిద్ధపడడం హరీష్ గట్స్‌ని తెలియజేస్తుంది. అలాగే తేజ్ లక్ కూడా హాట్ టాపిక్ అవుతుంది.