దటీజ్ పూరి.. ఇట్స్ మెహబూబా

ఒకే రోజు గురువు వర్మ సినిమా ఆఫీసర్ టీజర్, శిష్యుడు పూరిజగన్నాధ్ సినిమా మెహబూబా ట్రయిలర్ వచ్చాయి. మెతుకు ముట్టి చెప్పొచ్చు అన్న సంగతి. సినిమాలు ఎలా వుంటాయన్నది స్క్రీన్ మీద పడేవరకు ఎవరూ…

ఒకే రోజు గురువు వర్మ సినిమా ఆఫీసర్ టీజర్, శిష్యుడు పూరిజగన్నాధ్ సినిమా మెహబూబా ట్రయిలర్ వచ్చాయి. మెతుకు ముట్టి చెప్పొచ్చు అన్న సంగతి. సినిమాలు ఎలా వుంటాయన్నది స్క్రీన్ మీద పడేవరకు ఎవరూ చెప్పలేరు. కానీ మేకింగ్ ఎలా వుండబొతొందన్నంత వరకు టీజర్లు, ట్రయిలర్లు చెబుతాయి.

ఆఫీసర్ టీజర్ చూస్తే, అబ్బొ సూపర్, అద్భుతం అనిపించలేదు. పైగా నాగ్ టీజర్ లో చేసిన షాట్ లు అన్నింటిలో కూడా సహజత్వం కన్నా డ్రామా ఎక్కువ కనిపించింది. అనుభవం పండిన నాగ్ లాంటి నటుడి నటనకు వంక పెట్టలేం. కానీ టీజర్ లో ఎందుకు అలా అనిపించింది అంటే వర్మ అంతకన్నా చేయించలేకపోయి వుండాలి. లేదా అలాగే చేయించి వుండాలి.

ఇక పూరిజగన్నాధ్ మెహబూబా ట్రయిలర్ వచ్చింది. ముందే అనుకున్నట్లు సినిమా ఎలా వుంటుందీ అన్నది తెలియదు కానీ, ట్రయిలర్ మాత్రం, గ్రాండ్, రిచ్ విజువల్స్ తో కళకళలాడింది. రెండు దేశాలు, రెండు మతాలు, ఒక ప్రేమ కాన్సెప్ట్ తో తయారైన మెహబూబా ట్రయిలర్ అయితే సగటు సినిమా ప్రేక్షకుడిని కచ్చితంగా ఆకట్టుకునేలా వుంది.

ఫ్లాపులు ఇస్తూ వస్తున్న కొద్దీ వర్మ చార్మ్ తగ్గుతూ వస్తోంది, పూరి స్టామినా పెరుగుతూ వస్తోంది అనుకోవాలి.