Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

వంశీ పైడిపల్లి సినిమాకు బ్రేక్?

వంశీ పైడిపల్లి సినిమాకు బ్రేక్?

వీలయినంత త్వరలో మురగదాస్ తో చేస్తున్న సినిమా పూర్తి చేసి, కొరటాల శివ డైరక్షన్ లో సినిమా స్టార్ చేయాలని మహేష్ ఆలోచన. ఆ తరువాత వంశీ పైడిపల్లి, ఆ పై త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇప్పటి వరకు ఇదీ ఆర్డర్ . కానీ ఇది మారిపోతుందేమో అన్న చిన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే డిసెంబర్ నాటికి త్రివిక్రమ్ ఫ్రీ అవుతారు. అప్పుడు ఆ సినిమా స్టార్ట్ చేయాలి కనుక. కానీ వ్యవహారం చూస్తుంటే అనుకున్నది అనుకన్నట్లు సాగేలా కనిపించడం లేదు. డిసెంబర్ లోపు రెండు సినిమాలు మహేష్ ఫినిష్ చేయాలంటే చాలా పెర్ ఫెక్ట్ ప్లానింగ్ వుండాలి. కొరటాల శివ తో ఆ విషయంలో ప్రాబ్లమ్ లేదు. ఆయన స్క్రిప్ట్ రేడీ చేసేస్తున్నారు. 

వంశీ పైడిపల్లి కూడా కథ,స్క్రిప్ట్ తో రెడీ గా వున్నారు, నిర్మాతలుగా అశ్వనీదత్, దిల్ రాజు ఫిక్స్. కానీ స్క్రిప్ట్ కు అసలు హక్కుదారుడు పివిపి తో ఇంకా లావాదేవీలు ఫినిష్ కాలేదని తెలుస్తోంది. వంశీ పైడిపల్లికి నిర్మాత పివిపితో రెండో సినిమా ఒప్పందం వుంది. ఇప్పుడు మహేష్ తో చేస్తామంటున్న స్క్రిప్ట్ ఏదైతే వుందో,అది పర్టిక్యులర్ గా పివిపి సంస్థ కోసం తయారు చేసింది. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే పివిపి సంస్థ ఖర్చులతో తయారైన స్క్రిప్ట్. అక్కడ సృజన వంశీ పైడిపల్లిది కావచ్చు కానీ, ఖర్చు పివిపి సంస్థది. మరి ఆ ఖర్చు, లావాదేవీలు తేలకుండా దాన్ని వేరే నిర్మాతకు ఎలా ఇస్తారు? వాళ్లు ఎలా వాడుకుంటారు? ఇక్కడ లీగాలిటీస్ ఏమిటి అన్నది ఇంకా తేలాల్సి వుంది. 

పివిపికి మహేష్ కు మధ్య సెటిల్మెంట్ కుదిరింది అని వార్తలు వచ్చాయి. కానీ వంశీ పైడిపల్లికి పివిపి మధ్య కుదిరినట్లు మాత్రం ఎక్కడా వార్తలు రాలేదు. అది కుదిరేదాకా, మహేష్ తో వంశీ సినిమా స్టార్ట్ కావడం కాస్త కష్టమేమో? సాధారణంగా వివాదాలకు దూరంగా వుండే మహేష్ ఈ సినిమాను తాత్కాలికంగా పక్కన పెట్టి, త్రివిక్రమ్ సినిమాతో ముందుకు వెళ్లిపోయినా ఆశ్చర్యం లేదు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?