మొత్తానికి ఇక్కడ షూటింగ్ వ్యవహారాలు ముగించుకుని బాహుబలి ఐర్లాండ్ తదితర విదేశీ లోకేషన్లకు వెళ్లబోతోంది. అక్కడ కొన్ని టాకీ పార్ట్ లు షూటింగ్ జరుగుతుంది. ఆపై రెండు పాటలు మాత్రమే బ్యాలెన్స్ వుంటాయని తెలుస్తోంది. వీటిని కూడా అక్కడ చిత్రీకరిస్తారా లేదా మళ్లీ ఆర్ఎఫ్ సి లో సెట్ వేసి చిత్రీకరిస్తారా అన్నది ఇంకా తెలియాల్సి వుంది.
ఎలాగైనా డిసెంబర్ చివరకు లేదా జనవరి చివరకు ప్రొడక్షన్ వర్క్ ముగించి, ఫిబ్రవరి నుంచి పోస్టు ప్రొడక్షన్ వర్కు మొదలెట్టాలని అనుకుంటున్నరు. 2015మధ్యలో కొంతకాలం మళ్లీ పార్ట్ 2 చిత్రీకరణ వుంటుంది. అందువల్ల ఇప్పుడు ఇటు ప్రభాస్ అటు అనుష్క కూడా చేరో కొత్త సినిమాకు సైన్ చేసే పనిలో వున్నారు. ప్రభాస్ లవ్ స్టోరీని ఎంచుకుంటే, అనుష్క, సీనియర్ డైరక్టర్ రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ డైరక్షన్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయాలనుకుంటోంది.