పెద్ద హీరోలు దగ్గరకు రానివ్వకపోవడంతో మీడియం రేంజ్ హీరోతో ఫరవాలేదనిపించుకునే సినిమా తీసి, ఓకె అనిపించుకున్నాడు దర్శకుడు పూరి. దాంతో మళ్లీ మహేష్ చెంత వాలిపోవచ్చు అనుకున్నాడు. కానీ అది కొంత వరకే నెరవేరింది. వన్ గుణపాఠంతో అంత సులువుగా దర్శకులను నమ్మడం లేదు మహేష్.. ఏదో లైన్ చెప్పేసి, గాల్లో రంగుల సినిమా చూపించేస్తే ఒకె అనడం లేదు.
అందునా పూరి రెండురోజుల్లో లైన్, నాలుగు రోజుల్లో కథ, ఎనిమిది రోజుల్లో స్క్రిప్టు అనే బాపతు. ఇలాంటి కథ మహేష్ కు నచ్చలేదని, మార్చమని, ఇంకా ఇంప్రూవ్ చేయమని చెప్పాడని వార్తలు వినిపిస్తున్నాయి. తాను అనుకున్నది చేసేయడం తప్ప, ముందు వెనుకలు అన్నది పూరికి తెలియని విద్య.
పైగా మహేష్ వ్యవహారం చూస్తుంటే, ఇప్పుడప్పుడే చాన్సిచ్చేట్లు కనిపించడం లేదు. ఇంకెవర్ని పట్టాలా అని చూస్తున్నాడు. దగ్గర్లో విష్ణు ఒక్కడే కనిపిస్తున్నాడు. అందుకోసమే త్వరలో విష్ణుతో ఓ సినిమా చేస్తాడని వినికిడి.