ఎన్టీఆర్ ఎప్పుడూ ప్రయోగాలు చేయడానికి ఇష్టపడడు. తనకు అలవాటైన కమర్షియల్ దారిలోనే సేఫ్‌గా వెళ్లిపోవాలని చూస్తుంటాడు.కానీ అక్కడే అతని ప్రయోగాలు బెడసికొడుతుంటాయి. హిట్ దర్శకుల్ని ఎంచుకొని సేప్ గేమ్ ఆడేయాలి అనుకొన్న ప్రతీసారీ బొక్కబోర్లాపడుతూనే ఉన్నాడు.
కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వడం… ఎన్టీఆర్ విషయంలో అరుదనే చెప్పాలి. అలాంటిది వక్కంతం వంశీ కథకు ఓకే చెప్పి, అతన్ని డైరెక్టర్ చేస్తానని మాటిచ్చాడు ఎన్టీఆర్. వక్కంతం కూడా మరేం పని పెట్టుకోకుండా ఎన్టీఆర్ కోసం అదిరిపోయే కథని సిద్ధం చేశాడు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టుని ఎన్టీఆర్ పక్కన పెట్టేసినట్టు సమాచారమ్.
వరుస ఫ్లాపుల నేపథ్యంలో రిస్క్ ఏమాత్రం చేయకూడదని ఎన్టీఆర్ బలంగా భావిస్తున్నాడట. అందుకే వంశీ సినిమా ప్రస్తుతానికి అటకెక్కించినట్టు తెలుస్తోంది. పాపం.. ఈ సినిమాపై ఆశలు పెంచుకొన్న వంశీ మాత్రం.. ఎన్టీఆర్ తన సినిమా చేస్తాడు, చేస్తాడు అనే ఎదురుచూస్తున్నాడు.