యువి-ప్రభాస్ సినిమా మరికాస్త లేట్?

ఈ మధ్య దర్శకులు లైన్ సూపర్ గా చెబుతున్నారు..కథనం వీక్ గా వుంటోంది. లైన్ ను రెండు గంటల సినిమాగా మార్చడంలో విఫలమవుతున్నారు. అయితే గతంలో హీరోలు దర్శకులపై నమ్మకంతో వదిలేసేవారు. కానీ ఇటీవల…

ఈ మధ్య దర్శకులు లైన్ సూపర్ గా చెబుతున్నారు..కథనం వీక్ గా వుంటోంది. లైన్ ను రెండు గంటల సినిమాగా మార్చడంలో విఫలమవుతున్నారు. అయితే గతంలో హీరోలు దర్శకులపై నమ్మకంతో వదిలేసేవారు. కానీ ఇటీవల తలలు బొప్పి కట్టడంతో జాగ్రత్త పడుతున్నారు. సోగ్గాడే చిన్ని నాయనా లైన్ సూపర్ అని చాన్సిస్తే, సీన్లు సరిగ్గా రాలేదని నాగ్ తిరగరాయిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ప్రభాస్ మరో అడుగు ముందుకు వేసి, షూటింగ్ కన్నా ముందుగానే జాగ్రత్త పడుతున్నట్లు వినికిడి.  రన్ రాజా రన్ సినిమా సూపర్ గా చేసాడని సుజిత్ కు చాన్సిచ్చాడు. అతగాడు కూడా మంచి లైన్ చెప్పాడు. కానీ స్క్రిప్ట్ విన్నాక, సరిగ్గా లేదని పించిందని వినికిడి. 

దాంతో మళ్లీ రీ సెట్ చేయమన్నాడట ప్రభాస్. సో…మరి కొంచెం టైమ్ తీసుకుంటుంది..అంటే బాహుబలి షూటింగ్ నుంచి రిలీవ్ అయినా, ప్రభాస్ సినిమా మరి కొంచెం లేట్ అవుతుందన్నమాట.