ఆది చేతిలో మరో సినిమా

హిట్..ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు ఆది సాయికుమార్. వీలయినంత వెర్సటాలిటీ వున్న సబ్ఙెక్ట్ లు ఎంచుకుంటూ ప్రయత్నిస్తున్నాడు. లేటెస్ట్ గా మరో సినిమాకు సైన్ చేసాడు.  Advertisement గతంలో…

హిట్..ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు ఆది సాయికుమార్. వీలయినంత వెర్సటాలిటీ వున్న సబ్ఙెక్ట్ లు ఎంచుకుంటూ ప్రయత్నిస్తున్నాడు. లేటెస్ట్ గా మరో సినిమాకు సైన్ చేసాడు. 

గతంలో అనేక సినిమాలు నిర్మించి నిర్మాత కేకెే రాధామోహన్ బ్యానర్ లో ఓ సినిమా చేయబోతున్నాడు.ఈ సినిమాతో ఫణి కృష్ణ సిరికి దర్శకుని గా పరిచయం అవుతున్నాడు. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో కథానాయకుడు గా ఆది సాయికుమార్ నటిస్తున్నారు. 

ఈ సినిమా త్వరలో రెడీ అవుతుంది. ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ.. ''అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అద్భుతమైన కథతో ఫణికృష్ణ నన్ను సంప్రదించారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్కు నచ్చే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. 

ఆది సాయికుమార్ ఈ సబ్జెక్ట్ కి సరిగ్గా సరిపోతారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి బాగా వస్తోంది. ఈ చిత్రానికి సరైన తారాగణం మరియు సాంకేతిక సిబ్బంది సెట్ అయ్యారు అని పేర్కొన్నారు.

పోస్ట్ సమ్మర్ లో మాంచి డేట్ చూసి విడుదలకు ప్లాన్ చేస్తున్నామని, ఆది కి ఈ సినిమా పక్కాగా సూట్ కావడమే కాకుండా కొత్తగా కూడా వుంటుందని రాధామోహన్ తెలిపారు.