అక్కడ వన్ అండ్ ఓన్లీ గా అశోక్

రెండేళ్ళుగా అనేక వివాదాలు, సంచలనాలతో రాష్ట్ర స్థాయిలో అందరిని నోళల్లో పడుతున్న శ్రీ సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు పదవీ కాలం తాజాగా పూర్తి అయిపోయింది. మొత్తం పదకొండు మంది ట్రస్ట్ బోర్డు సభ్యులు…

రెండేళ్ళుగా అనేక వివాదాలు, సంచలనాలతో రాష్ట్ర స్థాయిలో అందరిని నోళల్లో పడుతున్న శ్రీ సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు పదవీ కాలం తాజాగా పూర్తి అయిపోయింది. మొత్తం పదకొండు మంది ట్రస్ట్ బోర్డు సభ్యులు ఇక మాజీలు అయ్యారు. రెండేళ్ల కాల పరిమితికి గానూ వీరిని 2020 మార్చి 4న ప్రభుత్వం నియమించింది.

ఇక అదే రోజున దేవస్థానం చైర్ పర్సన్ గా సంచయితను ప్రభుత్వం నియమించడంతో అతి పెద్ద వివాదమే చెలరేగింది. దాని మీద కేంద్ర మాజీ మంత్రి పూసపాటి వంశీకుడు అశోక్ గజపతి రాజు న్యాయ పోరాటం చేసిన మీదట ఆరు నెలల క్రితం సంచయిత పదవి నుంచి దిగిపోయారు.

ఇక ఇపుడు ట్రస్ట్ బోర్డు మొత్తానికి  మొత్తం ఖాళీ అయింది. దీంతో వన్ అండ్ ఓన్లీ గా అశోక్ గజపతిరాజు ట్రస్ట్ బాధ్యతలు చూస్తారు అన్న మాట. ఏపీలో వైసీపీ సర్కార్ కి మరో రెండేళ్లకు పైగా పదవీకాలం ఉన్నందువల్ల కొత్త బోర్డుని నియమించవచ్చు.

మరి ఆ ముచ్చ‌ట ఎపుడు ఉంటుందో తెలియదు కానీ ప్రస్తుతానికి చూస్తే అశోక్ అంతా అన్నట్లుగానే అప్పన్న ఆలయంలో సీన్ ఉంది. మొత్తానికి తెలుగుదేశం హయాంలో ట్రస్ట్ బోర్డు లేకుండానే అశోక్ ఒక్కరే అంతా అయి చూశారు. ఇపుడు వైసీపీ సర్కార్ అప్పన్న ఆలయా ట్రస్ట్ బోర్డు ని వేయకుండా వదిలేస్తుందా అన్నది డౌటే.

ఏది ఏమైనా కొన్నాళ్ళ పాటు అయినా రాజా వారు ఏకైన పాలితులుగా ఉంటారు అని అంటున్నారు. ఇక ట్రస్ట్ బోర్డు ఏర్పాటు అయినా గొడవలు, న్యాయ వివాదాలతో  పాటు కరోనా కారణంగా తాము పదవులు ఏమీ అనువించలేదని, ఆఖరుకు ఏడాదికి ఒకమారు వచ్చే స్వామి వారి నిజ రూప దర్శనం కూడా లేకుండానే పదవి పోయిందని మాజీ మెంబర్స్ వాపోతున్నారు. సో వీరికే మరో విడత చాన్స్ దక్కుతుందా. చూడాలి.