14 నుంచి అఖిల్ సినిమా స్టార్ట్!

ఏజెంట్ సినిమా డిజాస్టర్ అనుభవం తరువాత హీరో అఖిల్ అక్కినేని చేయబోయే సినిమా షూట్ ఈ నెల 14 నుంచి ప్రారంభం కాబోతోంది.

ఏజెంట్ సినిమా డిజాస్టర్ అనుభవం తరువాత హీరో అఖిల్ అక్కినేని చేయబోయే సినిమా షూట్ ఈ నెల 14 నుంచి ప్రారంభం కాబోతోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ సినిమాకు నందు దర్శ‌కుడు. గతంలో తిరుపతి బ్యాక్ డ్రాప్ లో వినరో భాగ్యము విష్ణు కథ అనే సినిమాను అందించారు.

వాస్తవానికి ఈ సినిమా కథను నిర్మాత సాహు గారపాటి తయారు చేయించుకున్నారు. కానీ కథ గురించి విని నాగార్జున దానిని తనకు కావాలని రిక్వెస్ట్ చేసి తీసుకున్నారు. తమ ఫ్యామిలీకి విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమాలు అచ్చి వస్తాయని, అఖిల్ కు కూడా అలాంటి సినిమా కావాలని చూస్తున్నా అని చెప్పి, ఈ సినిమాను తన స్వంత బ్యానర్ మీద నిర్మిస్తున్నారు.

ఈ సినిమా ఈ నెల 14న హైదరాబాద్ లో ప్రారంభం అవుతుంది. ఎక్కువ భాగం షూటింగ్ చిత్తూరు జిల్లాలో జరుగుతుంది. సినిమాలో చిత్తూరు మాట పలుకుబడి వుంటుంది. చిత్తూరు ప్రాంతంలోని భారతం మెట్ట అని ఒక కొండ ప్రాంతం వుంది. అక్కడ ఎక్కువ షూటింగ్ జరుగుతుంది.

నాగార్జున నిర్మాతగా అఖిల్ కోసం చేస్తున్న రెండో సినిమా ఇది. గతంలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేసారు. అఖిల్ హీరోగా ఇప్పటి వరకు నాలుగైదు సినిమాలు చేసారు. కానీ ఒక్కటి కూడా బాక్సాఫీస్ దగ్గర హిట్ కాలేదు. ఈ సినిమాతో హిట్ కొడతా అని నమ్మకంగా వున్నారు. ఇది కూడా యువి సంస్థ కూడా ఓ ప్రాజెక్ట్ ను అఖిల్ కోసం సెట్ చేసి వుంచింది.

4 Replies to “14 నుంచి అఖిల్ సినిమా స్టార్ట్!”

  1. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ హిట్ ని గుడ్డి కళ్ళకి కనబడలేదా గ్రేట్ ఆంధ్ర

Comments are closed.