హీరోయిన్లపై బాడీ షేమింగ్ కామెంట్స్ కొత్త కాదు. గతంలో బాలీవుడ్ హీరోయిన్ వాణీ కపూర్ పై జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆ తర్వాత అదే తరహా కామెంట్స్ కరీనా కపూర్ పై కూడా వినిపించాయి. ఇప్పుడీ బాడీ షేమింగ్ కు బాధితురాలిగా మారింది అలియా భట్.
అలియా భట్ కాస్మొటిక్ సర్జరీ ఫెయిల్ అయిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈమధ్య ఆమె నవ్వితే మూతి వంకర పోతోందంటూ కొన్ని పోస్టులు కనిపిస్తున్నాయి. ఆమె మాట్లాడుతున్నప్పుడు కూడా ముఖం తేడాగా కనిపిస్తోందంటూ కొంతమంది విమర్శలు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేసే వారిపై అలియా భట్ మండిపడింది. తన లుక్స్ గురించి విమర్శలు చేస్తున్న వారి కోసం అలియా సుదీర్ఘమైన పోస్టు పెట్టింది.
“కాస్మెటిక్ కరెక్షన్ లేదా సర్జరీ చేయించుకునే ఎవరి గురించి నేను అస్సలు తీర్పు చెప్పను. మీ శరీరం, మీ ఎంపిక. కానీ ప్రస్తుతం నడుస్తున్న ట్రోలింగ్ హాస్యాస్పదంగా ఉంది! నేను చేయించుకున్న బొటాక్స్ ఫెయిల్ అయిందంటూ వీడియోలు ప్రత్యక్షమౌతున్నాయి. మీ అభిప్రాయం ప్రకారం, నేను వంకరగా నవ్వుతాను, మాట్లాడినప్పుడు వింతగా ఉంటాను. నా ముఖం ఒకవైపు పక్షవాతానికి గురైందని, శాస్త్రీయ ఆధారాలు చూపుతూ మాట్లాడుతున్నారు. ఎలాంటి ఆధారాల్లేకుండా ఇలాంటి వీడియోలు ఎలా చేస్తారు. ఇలాంటి ఆరోపణలు చేసినప్పుడు కనీసం మీ దగ్గర చిన్న సమాచారమైనా ఉందా?”
ఇలా తనపై జరుగుతున్న ట్రోలింగ్ ను ఖండించింది అలియా భట్. తన ముఖం, నవ్వుపై విమర్శలు చేస్తున్న వాళ్లలో మహిళలు కూడా ఉండడం బాధగా ఉందంటోంది.
Call boy jobs available 9989793850
Body shaming. Very sad.
Rumours kuda anthe evadiki vachindhi media lo rasthadu