అల్లు అర్జున్ బాలీవుడ్ ప్లాన్స్ ను సీరియస్ గానే వేస్తున్నట్టుగా ఉన్నాడు. ఇప్పటికే డబ్బింగ్ సినిమాలు, యూట్యూబ్ వ్యూస్ తో బాలీవుడ్ లో ఉనికిని చాటుకుంటున్నాడు అల్లు అర్జున్. యూట్యూబ్ కే పరిమితమైన తన డబ్బింగ్ సినిమాల క్రేజ్ ను మరింతగా పెంచుకునే ప్రయత్నంలో ఉన్నాడు ఈ హీరో.
ఈ క్రమంలో బాలీవుడ్ లో డైరెక్ట్ సినిమాకు ఇతడు రెడీ అవుతున్నట్టుగా ఉన్నాడు. తాజాగా ఈ హీరో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా భన్సాలీ ఆఫీసుకు వెళ్లడం ఆసక్తిదాయకంగా ఉంది. బన్నీ, భన్సాలీ కాంబోలో ఏదైనా సినిమా రూపొందుతుందనే ఊహాగానాలను ఈ మీటింగ్ పెంచుతోంది. నిర్మాతగా యాక్షన్ ఎంటర్ టైనర్లను రూపొందించడంలో భన్సాలీ బిజీగా ఉన్నాడు.
సౌతిండియన్ మాస్ మసాలాల తరహాలో బాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో భన్సాలీ సినిమాలు నిర్మిస్తున్నాడు. దర్శకుడిగా ఒక పంథా, నిర్మాతగా మరో రూటును అనుసరిస్తున్నాడు. సౌత్ సినిమాలను హిందీలో నిర్మించడంపై కూడా నిర్మాతగా భన్సాలీ ఆసక్తిని చూపిస్తూ వస్తున్నాడు.
ఈ క్రమంలో అల్లు అర్జున్ తో బిగ్ బాలీవుడ్ కమ్ టాలీవుడ్ సినిమాను ఈ ఫిల్మ్ మేకర్ ప్లాన్ చేసినా పెద్ద ఆశ్చర్యం లేదు. అల్లు అర్జున్ హోం బ్యానర్ కు హిందీలో సినిమాలు రూపొందించి, హిట్ చేసుకున్న నేపథ్యం ఉంది. అయినా.. భన్సాలీ వంటి బాలీవుడ్ లో పాతుకుపోయిన ఫిల్మ్ మేకర్ అవసరం ఎంతైనా ఉంటుంది.