Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఎఎంబి విక్టరీగా మారుతున్న సుదర్శన్

ఎఎంబి విక్టరీగా మారుతున్న సుదర్శన్

క్రాస్ రోడ్స్ సుదర్శన్ థియేటర్ అంటే జంట నగరాల సినిమా లవర్స్ కు ఓ ఎమోషన్.  మహేష్ బాబుకు తన సినిమా సుదర్శన్ లో వేయాల్సిందే. సినిమా విడుదల నాడు మాస్ థియేటర్ లో సినిమా చూడాలంటే సుదర్శన్ దారి పట్టాల్సిందే. అలాంటి సుదర్శన్ ను పడగొట్టి మల్టీ ప్లెక్స్ చేస్తారని ఎప్పటి నుంచో వార్తలు వున్నాయి.

ఆసియన్ మహేష్ బాబు మాదిరిగా, ఆసియన్ రామ్ చరణ్ థియేటర్ వస్తుందని వార్తలు కూడా వినవచ్చాయి. కానీ ఇప్పుడు డీల్ ఫైనల్ అయింది. కానీ రామ్ చరణ్ తో కాదు. విక్టరీ వెంకటేష్ తో.

ఎఎంబి విక్టరీ పేరుతో సుదర్శన్ థియేటర్ ను మల్టీ ప్లెక్స్ గా మారుస్తారు. ఈ గురువారం పూజ చేస్తారు. ఎఎంబి అంటే ఆసియన్ మహేష్ బాబు.. విక్టరీ అంటే వెంకటేష్. ఆ విధంగా ఆసియన్ సునీల్, మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ ముగ్గురి భాగస్వామ్యంలో ఈ మల్టీ ప్లెక్స్ వుంటుంది. వెంకటేష్ కు థియేటర్ల వ్యాపారం కొత్త కాదు, తండ్రి రామా నాయుడు, సోదరుడు సురేష్ బాబు థియేటర్ల వ్యాపారంలో వున్నారు. వాటిల్లో వెంకీకి వాటా వుంది. కానీ ఫస్ట్ టైమ్ ఆయన పేరు మీద నేరుగా థియేటర్ వస్తోంది.

ఇప్పటికే ఆసియన్ సంస్థ మహేష్ తో పాటు, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, రవితేజ లతో జట్టు కట్టిన సంగతి తెలిసిందే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?