ఈ వివాదాన్ని ఇక్కడితో ఆపేయండి

మొత్తం వ్యవహారంలో బాధితురాలిగా మారిన అన్షు ఎట్టకేలకు స్పందించింది. ఈ విషయాన్ని ఆమె తేలిగ్గా తీసుకుంది.

హీరోయిన్ అన్షును ఉద్దేశించి మాట్లాడుతూ “సైజులు” అనే అభ్యంతరకరమైన పదాన్ని ఉపయోగించాడు దర్శకుడు త్రినాధరావు నక్కిన. దీంతో సభ్యసమాజం భగ్గుమంది. మహిళా కమిషన్ ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించింది.

విషయం తెలుసుకున్న త్రినాధరావు నక్కిన వెంటనే బయటకొచ్చాడు. తప్పు జరిగింది క్షమించమంటూ వీడియో రిలీజ్ చేశాడు. నవ్వించే ప్రయత్నంలో అనుకోకుండా తన నోటి నుంచి అప్రయత్నంగా ఆ మాటలు వచ్చేశాయని, అయినప్పటికీ చాలామంది మనసు నొచ్చుకుంది కాబట్టి తప్పుతప్పేనంటూ భేషరతుగా క్షమాపణలు చెప్పాడు.

ఇదే వీడియోను షేర్ చేస్తూ దర్శకుడు సందీప్ కిషన్ కూడా పోస్ట్ పెట్టాడు. నోరు జారి త్రినాధరావు అలా మాట్లాడారని, ఆయన మంచి పదాలు ఉపయోగిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. త్రినాధరావుతో పాటు మజాకా యూనిట్ తరఫున మహిళా లోకానికి క్షమాపణలు కోరాడు.

మొత్తం వ్యవహారంలో బాధితురాలిగా మారిన అన్షు ఎట్టకేలకు స్పందించింది. ఈ విషయాన్ని ఆమె తేలిగ్గా తీసుకుంది. నక్కిన చాలా మంచోడంటోంది ఈ హీరోయిన్.

“ఈ గ్రహంలో లవ్లీ పర్సన్ ఆయన. ఆయన కావాలని అలా మాట్లాడలేదు. దాదాపు 60 రోజులు ఆయనతో కలిసి పనిచేశాను. తన కుటుంబ సభ్యురాలిగా నన్ను ఆయన ట్రీట్ చేస్తాడు. ఆయనంటే నాకెంతో గౌరవం, ప్రేమ. నా రీఎంట్రీకి అతడి కంటే మంచి దర్శకుడు నాకు దొరకడు. నన్ను ఎంతో ప్రోత్సహించి గైడ్ చేశారు.”

ఇలా ఈ వివాదాన్ని చల్లార్చే ప్రయత్నం చేసింది అన్షు. ఇకనైనా త్రినాధరావుపై విమర్శలు ఆపాలని, దయచేసి ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించాలంటూ అందరికీ విజ్ఞప్తి చేస్తోంది.

8 Replies to “ఈ వివాదాన్ని ఇక్కడితో ఆపేయండి”

  1. కనీసం ఈ సారైనా… మహిళా కమిషన్ ఇలాంటి వెధవ మీద చర్య తీసుకుంటే బాగుంటుంది

  2. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

Comments are closed.