ఒక్క ప్రశ్నతో అమ్మ ఆనందం పోయింది

ఇన్నేళ్ల కష్టం ఆమె అడిగిన ఒక్క ప్రశ్నతో పోయింది. పొట్టేల్ సినిమాతో మా అమ్మ నన్ను చూసి గర్వపడింది. ఆ ఒక్క ప్రశ్నతో ఆ ఆనందం పోయింది

కాస్టింగ్ కౌచ్ పై అభ్యంతరకరమైన రీతిలో ఓ మహిళా జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు హీరోయిన్ అనన్య నాగళ్ల చాలా ఇబ్బంది పడింది. నేరుగా తనకు సంబంధించిన ప్రశ్న కానప్పటికీ.. తనను మాత్రమే అడిగేసరికి, అది చాలా విధాలుగా తనను, తన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతోందని బాధపడింది. మరీ ముఖ్యంగా తన అమ్మ ఆనందం ఆ ఒక్క ప్రశ్నతో మాయమైందని చెప్పుకొచ్చింది.

“ఇంట్లో ఫైట్ చేసి నటిని అయ్యాను. ప్రతిరోజూ బయటకొచ్చేటప్పుడు మా అమ్మ ముఖంలో ఓ టెన్షన్ ఉంటుంది. ఏం కాదమ్మా అని చెప్పే ఎక్స్ ప్రెషన్ నా ముఖంపై ఉంటుంది. వాళ్లు ఎప్పుడూ నన్ను వ్యతిరేకిస్తూనే ఉంటారు. నేను ఇండస్ట్రీకొచ్చి కుటుంబం పరువు తీసేశాననే ఫీలింగ్ లోనే ఇప్పటికీ నా బంధువులున్నారు. పొట్టేల్ తో నన్ను చూసి అంతా గర్వపడతారనుకున్నాను. సదరు మీడియా ప్రతినిధి కాస్టింగ్ కౌచ్ గురించి అడగడంతో, నేను కూడా అలానే చేసి ఈ స్థాయికి వచ్చానని నా బంధువులు అనుకుంటారు. నా బ్రదర్ పెళ్లి ఉంది, కచ్చితంగా మా అమ్మను అడుగుతారు. ఇన్నేళ్ల కష్టం ఆమె అడిగిన ఒక్క ప్రశ్నతో పోయింది. పొట్టేల్ సినిమాతో మా అమ్మ నన్ను చూసి గర్వపడింది. ఆ ఒక్క ప్రశ్నతో ఆ ఆనందం పోయింది.”

ఇలా ఒక్క ప్రశ్న తనను, తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిందని అంటోంది అనన్య. దీనికి సంబంధించి ఆరోజు రాత్రి కొంతమంది మీడియా ప్రతినిధులు తనకు కాల్ చేసి సారీ చెప్పారని, అందరూ తనను తమ ఇంటి అమ్మాయిగా ఫీల్ అయ్యారని, అది తనకు బలం ఇచ్చిందని అంటోంది.

సదరు మహిళా జర్నలిస్ట్ కాస్టింగ్ కౌచ్ పై ప్రశ్న అడినప్పుడు అది అంత ప్రభావం చూపిస్తుందని తనకు అర్థం కాలేదని, ఆ రోజు రాత్రి అమ్మతో మాట్లాడిన తర్వాత, తనకొచ్చిన కొన్ని కాల్స్ వల్ల దాని ప్రభావం తెలిసొచ్చిందని అంటోంది అనన్య.

4 Replies to “ఒక్క ప్రశ్నతో అమ్మ ఆనందం పోయింది”

  1. ప్రశ్న అడిగిన జర్నలిస్టు కి నైతిక విలువలు లేవు ఖచ్చితంగా. అనన్య గారు మంచి నటి. వాళ్ళకి మంచి కుటుంబం ఉంటుంది కదా. ఎక్సపోజింగ్ చేసే అమ్మాయి కాదు.

  2. ఔను.. తాటి చెట్టుకిందు కూర్చొని పాలు తాగుతున్నా అంటే ఎవరు నమ్ముతారు.. సంప్రదాయం ఉన్న కుంటుంబం సంప్రదాయం గా ఉంటేనే గౌరవం మరి…

Comments are closed.