ఈ లీకులు అన్ స్టాపబుల్

ఓవైపు తమ షోకు హైప్ తీసుకురావడానికి ‘ఆహా’ కిందామీద పడుతుంటే, ఊహించని విధంగా లీకులు దెబ్బకొడుతున్నాయి. అవును.. అన్ స్టాపబుల్ కు కూడా లీకులు మొదలయ్యాయి. Advertisement సీజన్-4కు హైప్ తీసుకొచ్చేందుకు భారీ కార్యక్రమం…

ఓవైపు తమ షోకు హైప్ తీసుకురావడానికి ‘ఆహా’ కిందామీద పడుతుంటే, ఊహించని విధంగా లీకులు దెబ్బకొడుతున్నాయి. అవును.. అన్ స్టాపబుల్ కు కూడా లీకులు మొదలయ్యాయి.

సీజన్-4కు హైప్ తీసుకొచ్చేందుకు భారీ కార్యక్రమం నిర్వహించారు. కొత్త కాన్సెప్ట్ అంటూ ప్రోమో రిలీజ్ చేశారు. ఆ యానిమేషన్ ప్రోమో పెద్దగా ఎవ్వరికీ నచ్చలేదు. దీంతో విమర్శలు తప్పలేదు.

ఇక తొలి ఎపిసోడ్ లో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబును రంగంలోకి దించారు. బాబుతో బాలయ్య మాటామంతీ అంటూ ‘ఆహా’నే ఘనంగా ప్రకటించేసుకుంది. దీనికి సంబంధించి ప్రోమో కట్ చేసింది.

రేపోమాపో ఆ ప్రోమోను ఘనంగా విడుదల చేద్దామని భావించింది, కౌంట్ డౌన్ కూడా షురూ చేసింది. అంతలోనే ఎవరో ఆకతాయిలు ఆపుకోలేక ఆ ప్రోమోను సోషల్ మీడియాలో లీక్ చేశారు. దీంతో ‘ఆహా’ ఖంగుతింది.

ఇప్పటికే షోకు బజ్ లేక ఇబ్బంది పడుతున్న ఆహాకు ఇలా ప్రోమో లీక్ అయ్యేసరికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. దీనికి సంబంధించి కొన్ని సోషల్ మీడియా ఎకౌంట్లకు హెచ్చరికలు జారీచేస్తూ డైరక్ట్ పోస్టులు కూడా పెట్టారు నిర్వహకులు. అయితే అప్పటికే జరగాల్సిన ప్రమాదం జరిగిపోయింది.

దీంతో మరికొన్ని మార్పులు చేసి ప్రోమో కట్ చేసి, కొద్దిసేపటికిందట హుటాహుటిన రిలీజ్ చేశారు. చంద్రబాబును జైళ్లో పెట్టినప్పుడు అనుభవించిన వ్యథ, జైళ్లో పవన్ కల్యాణ్ తో సమావేశమైనప్పుడు ఏం మాట్లాడారనే విషయాల్ని ఈ కార్యక్రమంలో బయటపెట్టారు.

లీక్ అయిన ప్రోమోలో బాబు-పవన్ బంధం గురించి బాలయ్య అడిగారు. “నీ షో ఎలాగైతే అన్ స్టాపబుల్లో.. రాజకీయాల్లో మా కాంబినేషన్ అన్ స్టాపబుల్” అంటూ బాబు స్పందించారు. తాజాగా రిలీజ్ చేసిన వెర్షన్ లో ఆ డైలాగ్ తొలిగించారు. దీంతో పాటు మరికొన్ని మార్పుచేర్పులు చేసి కొత్త ప్రోమో వదిలారు. 25న ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ తో అన్ స్టాపబుల్ సీజన్-4 షురూ కానుంది.

10 Replies to “ఈ లీకులు అన్ స్టాపబుల్”

  1. అసలు ఈ షో ఇండియా లో టాప్ రేటింగ్ వుంది అంటుంటే… నువ్వు అసలు బజ్ లేదు అనడం ఏమిటో…

    అందరూ మన అన్నియ లాగా పక్క వాళ్ళ ట్రాఫిక్ ని డైవర్ట్ చేయరు కదా

  2. balayya actually does not reside in hindupur continuously for 2 days and does shows sitting in other state capital and does not stay in AP. great going balayya and hats off to hindupr voters for electing permanent Non-Local

  3. తర్వాత తీరిగ్గా వేదన అదే జైల్లో రోదన గురించి చెప్పొచ్చు.. హిందూపూర్ ఘటన బాధితులకు ఏమైనా న్యాయం చేసే అవకాశం ఉందా

Comments are closed.