నెట్ ఫ్లిక్స్‌లో కొండల్ (మళయాళం) చూసాను. కొండల్ అంటే మేఘం అని అర్థమట. ఈ మధ్య చూసిన యాక్షన్ సినిమాల్లో బాగా నచ్చింది కిల్ (హాట్‌స్టార్). తరువాత కొండల్ రొటీన్ సినిమా ఫార్ములా ఏమీ వుండదు. నాన్‌స్టాఫ్ యాక్షన్. కిల్ 80 శాతం రైల్లో జరిగితే , కొండల్ సముద్రంలో. కిల్‌లో ఎమోషన్ వుండదు. క్యారెక్టర్లు కూడా రిజిస్టర్ కావు. కొండల్‌లో ఎమోషన్ వుంటుంది. ప్రతి క్యారెక్టర్ గుర్తుంటాడు.
సినిమా ప్రారంభంలో ఏదో చేపల వ్యాపారానికి సంబంధించిన ఆధిపత్య పోరాటం అనుకుంటాం. తరువాత హీరో చేపల పడవ ఎక్కుతాడు. అతనితో పాటు కొందరు వాళ్ల మధ్య జరిగే కథే మిగతా సినిమా. సముద్రంలో కొద్ది రోజులుండి, చేపలతో తిరిగి వస్తే డబ్బులు దండిగా దక్కుతాయి. ఎవరికి వాళ్లు అవసరాల కోసం పనిలోకి వచ్చి వుంటారు. వీళ్లలో పదహారేళ్ల కుర్రాడు కూడా వుంటాడు. హీరో నిజంగా చేపల వేటకే వచ్చాడా? వేరే కారణం వుందా?
జాలర్ల జీవితాన్ని బాగా పరిశీలించి, పరిశోధించి తీసిన సినిమా ఇది. రోజుల తరబడి సముద్రంలో వుండే జాలర్లు ఎలా వుంటారు, ఏం తింటారు, రోజువారీ పనులేంటి ఇదంతా కళ్ల ముందు కనబడుతూ వుంటుంది. ఒక రకంగా ప్రేక్షకుడు కూడా సముద్రంలోనే వుంటాడు.
ఈ మధ్య వచ్చిన దేవరలో లేనిది, కొండల్‌లో వున్నది ఇదే. దేవరలో మనం సముద్రాన్ని ఫీల్ కాలేము. హీరో ఎలివేషన్‌లో ఇరుక్కుని , వాస్తవ ప్రపంచాన్ని మిస్సయ్యింది. ఎన్టీఆర్‌లో జాలరి కనపడడు. శ్రీకాంత్‌ని జాలరిగా వూహించడమే కష్టం. నటులే తప్ప పాత్రలు కనపడలేదు. కొరటాల శివ ఫెయిల్యూర్ ఇది. జనతా జనతా గ్యారేజ్ లో జరిగిన క్యారెక్టర్ రిజిస్ట్రేషన్ ఇక్కడ వర్కవుట్ కాలేదు. ఆ సినిమాలో మోహన్‌లాల్, ఎన్టీఆర్ కనపడరు. పాత్రలే కనిపిస్తాయి.
కొండల్‌లో హీరోగా అంధోనీవర్గీస్ నటించాడు. అంగమలీ డైరీస్ చూసిన వాళ్లకి తెలుసు. జల్లికట్టులో కూడా వున్నాడు. కన్నడ ప్రముఖ నటుడు దర్శకుడు రాజ్ బి శెట్టి కీలకమైన పాత్ర చేసాడు. కాంతారా రిషబ్ శెట్టికి ఇతను కజిన్.
గరుడ గమన వృషభవాహన (కన్నడ) సినిమా చూసిన వాళ్లెవరూ రాజ్‌శెట్టిని మరిచిపోలేరు. చూడడానికి గ్లామర్ ఫేస్ కాదు కానీ, యాక్టింగ్ వేరే రేంజ్.
కొండల్ సినిమాకి ప్రాణం ఫొటోగ్రఫి, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ (బిజిఎం). కథలో పెద్దగా విషయం లేనప్పటికీ, మనల్ని కూర్చోపెట్టేవి ఇవి రెండే. ఫస్టాప్ స్పీడ్‌గా నడుస్తుంది. హీరో మోటివ్ ఇంటర్వెల్‌కి అర్థమయ్యే సరికి , ముగింపు కూడా స్పష్టమవుతుంది. దాంతో రిపీట్ సీన్స్ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఫైనల్‌గా గ్రాఫిక్స్‌లో సొరచేప. మొత్తంగా చూసి తీరాల్సిన సినిమా.
తెలుగులో రచయితలకి విలువ లేకపోవడం, దర్శకులు తామే సర్వజ్క్షానులమని భావించడం వల్ల కథలకి దరిద్రం పట్టింది. 900 కిలోమీటర్ల సముద్ర తీరమున్న ఆంధ్రప్రదేశ్ నుంచి , జాలర్ల కథలు, సముద్ర నేపథ్యమున్న కథలు ఎన్ని వచ్చాయి?
మన దగ్గర రైటింగ్‌కి పెద్ద బడ్జెట్ లేదండి అని డైరెక్టర్లు గర్వంగా చెబుతూ వుంటారు. నిజానికి అది సిగ్గు పడాల్సిన విషయం. టోటల్ బడ్జెట్‌లో కనీసం 3 శాతం కూడా రైటింగ్‌కి కేటాయించని భావ దారిద్య్రంలో మంచి కథలు పుట్టవు. పుట్టినా పురిట్లోనే చంపేస్తారు.
జీఆర్ మహర్షి
Manaki hero smart ga and heroine glamorous ga undali 4 fights and 6 songs andulo oka item song undali. story tho pani ledu . edi Tisina chuse vallu elago unnaru inkenduku stories manaki
చిన్న హీరో తో అయినా సముద్రం లో పడవ మీద ఎక్కువ భాగం తీసి క్వాలిటీ మైంటైన్ చేశారు. మీరన్నట్లు రిపీటెడ్ సీన్స్ ఉన్నాయి. మరీ ఎక్కువ సహజం గా ఉంది!
“కొండల్ అంటే మేఘం అని అర్థమట…900 కిలోమీటర్ల సముద్ర తీరమున్న ఆంధ్రప్రదేశ్ నుంచి , జాలర్ల కథలు, సముద్ర నేపథ్యమున్న కథలు ఎన్ని వచ్చాయి?”
మహర్షి లాంటి ఔత్సాహికుల కొరకేగా ‘మేఘ సందేశం’ తీశారు. జాలర్లు అంటే సముద్రం మీదనే కాదు నదుల్లో కూడా చేపలు పడతారు.
‘నా పాట నీ నోట పలకాలి సిలికా!’ అని అక్కినేని ఆఫీస్ లో ఏసీ వేసుకొని పాడతాడనుకుంటా.
vc estanu 9380537747
అందరం కలిసి crowd pulling చేసైనా సినిమా తీసేద్దాం! కథ, దర్శకత్వం నీదే! కనీసం ఒక వారం రోజులు థియేటర్ లో ఆడించు చూద్దాం…!