‘కామ్రేడ్’ లో బర్నింగ్ పాయింట్

డియర్ కామ్రేడ్ లో మహిళలు ఎదుర్కొంటున్న ఓ బర్నింగ్ పాయింట్ ను టచ్ చేసామని, కాలేజీ యూనియన్లు, లవ్, రొమాన్స్ అన్నీ వుంటూనే, ఈ పాయింట్ కూడా వుంటుందని దర్శకుడు భరత్ కమ్మ అన్నారు.…

డియర్ కామ్రేడ్ లో మహిళలు ఎదుర్కొంటున్న ఓ బర్నింగ్ పాయింట్ ను టచ్ చేసామని, కాలేజీ యూనియన్లు, లవ్, రొమాన్స్ అన్నీ వుంటూనే, ఈ పాయింట్ కూడా వుంటుందని దర్శకుడు భరత్ కమ్మ అన్నారు. ఆయన తొలిసారి దర్శకత్వం వహించిన డియర్ కామ్రేడ్ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో 'గ్రేట్ ఆంధ్ర'తో ముచ్చటించారు. విజయ్ పెళ్లిచూపులు సినిమా చేస్తున్న టైమ్ లో చెప్పిన కథ ఇది అని, ఆ తరువాత అర్జున్ రెడ్డి, గీతగోవిందం లాంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చినా, విజయ్ ఈ కథనే నమ్మి, దీని మీదే ముందుకు వెళ్లారని చెప్పారు. 

వాస్తవానికి విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్, రేంజ్ ను బట్టి వేరే కథను చేద్దామా? అని అడిగినా, ఈ కథే చేద్దామన్నారని, అయితే విజయ్ రేంజ్ మేరకు కథలో మార్పులు చేయకపోయినా, గ్రాండియర్ ను తీసుకువచ్చామని భరత్ వివరించారు. 

సినిమాలో రోడ్ జర్నీ ఎపిసోడ్ అంటూ ప్రత్యేకంగా వుండదని, అంతా ఓ మాంటేజ్ సాంగ్ లో ఫినిష్ అయిపోతుందని తెలిపారు. సినిమాలో కాలేజీ ఎపిసోడ్, రొమాంటిక్ ఎపిసోడ్ లు అన్నీ తాను అనుకున్నట్లు బాగా వచ్చాయని సంతృప్తి వ్యక్తం చేసారు. విజయ్ అభిమానులతో పాటు, మహిళల ఆదరణ కూడా ఈ సినిమాకు వుంటుందని, సినిమాలో వున్న కంటెంట్ అలాంటిది అని ఆయన అన్నారు. 

కాకినాడ నుంచి మాస్టర్స్ చేయడానికి అని హైదరాబాద్ వచ్చి, అనుకోకుండా సినిమారంగం మీద ఆసక్తితో ఇటు వచ్చానని భరత్ తన జర్నీని వివరించారు. అప్పటి నుంచి చేస్తున్న ప్రయత్నాలు ఫలించి ఇప్పటికి సినిమా రూపు దాల్చాయని అన్నారు.