దేవర సినిమాకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు వచ్చేశాయి. ఈ మేరకు జీవో రిలీజైంది. నైజాంలో దేవర సినిమా కోసం 27వ తేదీ ఒంటి గంట షోకు ప్రత్యేక అనుమతి మంజురైంది.
27వ తేదీ రాత్రి ఒంటి గంట షోను 29 థియేటర్లలో ప్రదర్శించుకోవచ్చు. ఆయా థియేటర్లలో టికెట్ రేట్ ను వంద రూపాయల వరకు పెంచుకోవచ్చని తెలిపారు. ఖమ్మంలోని 5 థియేటర్లకు, మిర్యాలగూడ, మహబూబ్ నగర్, గద్వాల్ లో చెరో థియేటర్ కు మిడ్ నైట్ షోలకు అనుమతినిచ్చారు.
మిగతా 21 థియేటర్లు హైదరాబాద్ లోనే ఉన్నాయి. హైదరాబాద్ లోని దాదాపు ప్రతి మెయిన్ థియేటర్ లో మిడ్ నైట్ షోలున్నాయి. ఏఎంబీ సినిమాస్, పీవీఆర్, ప్రసాద్స్ లాంటి మల్టీప్లెక్సులు లిస్ట్ లో ఉన్నాయి. ఎక్కువగా సింగిల్ స్క్రీన్స్ లో అర్థరాత్రి ఆటకు అనుమతులిచ్చారు.
మిడ్ నైట్ షోలకు 29 థియేటర్లకే అనుమతి ఇవ్వగా.. తెలంగాణలోని అన్ని థియేటర్లలో 27వ తేదీన ఉదయం 4 గంటల నుంచి షోలు ప్రారంభించుకోవడానికి, ఆ రోజు ఏకంగా 6 షోలు వేసుకోవడానికి అనుమతి దొరికింది. ఈ 6 షోలకు మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్స్ తేడా లేకుండా టికెట్ పై వంద రూపాయల పెంపునకు అవకాశం ఇచ్చారు.
ఇక 28వ తేదీ నుంచి 6వ తేదీ వరకు నైజాంలోని ప్రతి స్క్రీన్ లో రోజుకు 5 షోలు వేసుకునేలా పర్మిషన్ ఇచ్చారు. ఈ 9 రోజులు మల్టీప్లెక్సుల్లో 50 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్ లో 25 రూపాయలు టికెట్ రేట్లు పెంచుకోవచ్చు. 7వ తేదీ నుంచి టికెట్ రేట్లు సాధారణ స్థితికి వస్తాయి.
జీవో రిలీజ్ అవ్వడంతో.. తెలంగాణలో దేవర అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. మెయిన్ సెంటర్స్ లో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.
Face chudu kata kapiri laga vuntaadu
మేం థియేటర్లో చూడం
vc estanu 9380537747