ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్‌లో సుధాకర్ మిక్కిలినేని నిర్మించిన దేవర సినిమా మరో మూడు రోజుల్లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకి టికెట్ రేట్లు పెంచే జీవోలు రెండు రాష్ట్రాల్లో కూడా వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పటిలా కాకుండా మంచి రేట్లు ఇచ్చారు. అలాగే, చాలా కాలం తర్వాత మిడ్ నైట్ షోలు కూడా అనుమతించారు, ఇది ఒక సర్ప్రైజ్. ఎన్టీఆర్‌కు తెలుగుదేశం పార్టీతో అనుబంధాలు లేవు కాబట్టి, టికెట్ రేట్లు పెరగవని అంతా అనుకున్నారు. కానీ నిర్మాత నాగవంశీ సినిమాను మొత్తం కొనుగోలు చేయడంతో, పవన్ కళ్యాణ్‌తో వున్న అనుబంధంతో మంచి రేట్లు సాధించారు.
నైజాంలో ఎప్పుడూ మంచి రేట్లు వస్తాయి అనేది అందరికీ తెలిసిందే. కానీ, ఈసారి అలా జరగలేదు. మొదటి రోజు రేట్లు పెంపు వరకు బాగానే ఉంది, కానీ రెండో రోజు నుంచి చాలా తక్కువగా పెంచారు. ఇది ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదు. కావాలనే అలా అడిగారు అన్న టాక్ వినిపిస్తోంది.
నైజాంలో పెద్ద సినిమాలకు పెద్ద రేట్లు పెడితే, సిటీ బాగానే ఉంటుందని, కానీ కింద సెంటర్లలో రేట్లు ఎక్కువ అయితే కలెక్షన్లపై ప్రభావం చూపుతుందని దేవర పంపిణీ వర్గాల భావన. అందుకే, మొదటి రోజుకే వంద రూపాయల అదనపు రేటు, రెండో రోజు నుంచి 25-50 రూపాయల లెక్కన అదనపు పెంపు తీసుకున్నారట.
కానీ ఇదే స్ట్రాటజీని ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు అమలు చేయలేదు అనేది మిలియన్ డాలర్ ప్రశ్న.
తొలి రోజు రాత్రి ఒంటి గంటకు వేసే షోలకు వెయ్యి రూపాయల రేటు పెట్టాలని అనుకున్నారు. ఇది అఫీషియల్‌గా చేస్తే ప్రభుత్వానికి జీఎస్టీ అదనంగా వస్తుందని భావించారు. కానీ, ఎందుకో తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా స్పందించలేదు.
దీంతో ఇప్పుడు పాత మోడల్‌లో బెనిఫిట్ షోల కింద టికెట్లు విక్రయించాల్సి వచ్చింది. షోల అనుమతులు వచ్చాయి కనుక, ఎలాంటి సమస్య లేదు. కానీ, ఇన్ని థియేటర్లలో బెనిఫిట్ షోలు అంటే టికెట్ రేట్లు ఖర్చులు కలిపి 1500 నుంచి 2000 రూపాయల వరకూ వెళ్లవచ్చు. అలాంటి స్థాయిలో ఎన్ని షోలు పడతాయి అన్నది ప్రశ్న. అలా కాకుంటే సాధారణ రేట్లకు వంద రూపాయలు అదనంగా వేసి అమ్ముకోవాల్సి ఉంటుంది.
ఇప్పుడే చూసుకోవాల్సిన విషయం ఏమిటంటే, తొలి రోజు భారీ కలెక్షన్లు కనిపిస్తాయా లేదా అన్నది. మొత్తానికి, నైజాంలో టికెట్ రేట్ల పెంపు విషయంలో ఏదో జరిగింది. అది ఏమిటో స్పష్టత రావాల్సి ఉంది. నైజాం ఏరియాకు 42 కోట్లకు పైగా పంపిణీ హక్కులు విక్రయించారు, ఇది చిన్న టాస్క్ కాదు. సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన అవసరం ఉంది ఈ టాస్క్ సాధించాలంటే. అసలు డివైడ్ టాక్ రాకూడదు.
Idey oka common man ki em aina cheyni antey police station lo vestaru.but every movie ki tickets relates pechutaru.TS govt only 50 anaru.but veeli 100 pencharu adi mari govt em action tesukoda.mari middle class people buildings matram padeystaunaru velaki matram tictes meeda em aina cheyachu prajalu matram em.unadu.ASKIMV LEADERS ONLY ONE THING YOU ARE ELECTED TO DO.HELP FOR RICH PEOPLE ORCOMMON PEOPLE WHY YOU ARE GIVING EVERY MOVIE HIGH PRICES.THAT THERE INTERST THEY ARE SPECNING HIGH MOVIES WHY PEOPL MUST PAY HIGE PRICES
టికెట్ రేట్లు ఎంతున్నా థియేటర్లో చూడం
Call boy jobs available 9989793850
vc estanu 9380537747
vc available 9380537747