పొంగులేటి అలా చేస్తాడా? మైండ్ గేమా?

ప్రభుత్వంలో గులాబీ పార్టీ కోవర్టులు ఉన్నారని, లోపల ఏం జరుగుతున్నదో తమకు తెలుస్తోందని కేటీఆర్ చెప్పాడు. అంటే మంత్రుల్లో కూడా కోవర్టులు ఉన్నారని అనుకోవాలా?

రాజకీయ నాయకులు ప్రత్యర్థుల మీద మైండ్ గేమ్ ఆడుతుంటారు. వాళ్ళను ఆందోళనకు గురి చేస్తుంటారు. పొలిటికల్ లీడర్స్ నిజాలు మాట్లాడుతున్నారో, అబద్దాలు మాట్లాడుతున్నారో తెలియదు. ఏదైనా ఆరోపణ చేసి దానికి ఆధారాలు ఉన్నాయంటారు. ఉంటాయో ఉండవో తెలియదు.

కేటీఆర్ నిజాలు చెబుతున్నాడో, అబద్దాలు చెబుతున్నాడో, రేవంత్ రెడ్డితో మైండ్ గేమ్ ఆడుతున్నాడో అర్థం కాకుండా ఉంది. తాను చెప్పింది తప్పయితే రాజకీయాలు వదిలేస్తా అని నమ్మకంగా చెబుతున్నాడు. అసలు రేవంత్ రెడ్డి కుర్చీ ఎక్కినప్పటినుంచే ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని ఆరు నెలల్లో లేదా ఏడాదిలో కూలి పోతుందని గులాబీ పార్టీ బాసులు, ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

రేవంత్ రెడ్డి సర్కారు ఎక్కువ కాలం ఉండదని, ఒక మంత్రి కూలగొడతాడని, తాను చెప్పింది నిజమై తీరుతుందని ఘటాపథంగా చెబుతున్నాడు. ప్రభుత్వంలో గులాబీ పార్టీ కోవర్టులు ఉన్నారని అంటున్నాడు. మంత్రులే ప్రభుత్వాన్ని కూలగొట్టడం దేశంలో కొత్త కాదు. వింత కాదు.

ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ దేశంలో లేనప్పుడు మంత్రి నాదెండ్ల భాస్కర్ రావు ఆయన ప్రభుత్వాన్ని కూల్చేశాడు. మహారాష్ట్రలో శివసేన థాకరే ప్రభుత్వాన్ని ఏకనాథ్ షిండే కూల్చేశాడు. ఇలాంటి ఘటనలు దేశంలో చాలా రాష్ట్రాల్లో జరిగాయి. రేవంత్ ప్రభుత్వాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూలుస్తాడని కేటీఆర్ చెబుతున్నాడు. ఇది జరిగి తీరుతుందన్నాడు.

పొంగులేటి అలా కూల్చాలంటే ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం మద్దతు ఉండాలి. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని నాదెండ్ల కూల్చినప్పుడు ఆయనకు అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ మద్దతు ఇచ్చింది. షిండేకు బీజేపీ అధిష్టానం మద్దతు ఇచ్చింది. మరి ఇప్పుడు సోనియాగాంధీ కానీ, రాహుల్ గాంధీగానీ ఆ పని చేస్తారా? సీఎం పదవి కోసం సీనియర్లు పోటీపడితే వారిని కాదని రేవంత్ రెడ్డికి పదవి కట్టబెట్టారు.

వాస్తవానికి రేవంత్ సీఎం కావడం ఒరిజినల్ కాంగ్రెస్ సీనియర్లకు ఇష్టం లేదు. కానీ అధిష్టానం నిర్ణయాన్ని కాదనలేకపోయారు. పొంగులేటి ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుడు కాదు. బీఆర్ఎస్ నుంచి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరాడు. నిజానికి రేవంత్ కూడా ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుడు కాదు. టీడీపీ నుంచి చేరాడు. కానీ మొదటి నుంచి మంచి దూకుడుగా వ్యవహరించాడు.

ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులెవరూ ఇలా లేరు. ఆయన దూకుడు, కేసీఆర్ ను ఎదుర్కొన్న తీరు అధిష్టానానికి నచ్చింది. ఆయన వల్లనే అధికారం దక్కిందని నమ్మి ఆయన్ని సీఎం చేసింది. ఇదే కేటీఆర్ గతంలో నల్గొండ జిల్లా బ్రదర్స్ (కోమటిరెడ్డి వెంకట రెడ్డి అండ్ రాజగోపాల్ రెడ్డి ) ప్రభుత్వాన్ని కూలగొడతారని అన్నాడు.

ఇప్పుడు పొంగులేటి పేరు ఎత్తుకున్నాడు. ప్రభుత్వంలో గులాబీ పార్టీ కోవర్టులు ఉన్నారని, లోపల ఏం జరుగుతున్నదో తమకు తెలుస్తోందని కేటీఆర్ చెప్పాడు. అంటే మంత్రుల్లో కూడా కోవర్టులు ఉన్నారని అనుకోవాలా? ఉన్నతాధికారుల్లో ఉండొచ్చేమో ! ఏది ఏమైనా కేటీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నాడనే అనిపిస్తోంది.

14 Replies to “పొంగులేటి అలా చేస్తాడా? మైండ్ గేమా?”

  1. ఇన్ని గేమ్ లు ఆడే పోటుగాడే అయ్యుంటే ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చునేవాడు కాదు

  2. నిజంగ కోవర్టులు ఉంటె ఆలా బయటకు చెప్పుకోరు.సైలెంట్ గ పని కానిస్తారు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడబ్బా

  3. లోగడ అన్నయ్య నేను గానీ ఒక విజిల్ వేసాను అంటే చంద్రబాబు ఎంఎల్ఏలు నా వైపుకి వస్తారు, ప్రభుత్వం కూలిపోతుంది అని రాజ్ భవన్ వద్ద కూసాడు, వైసీపీ నుండి 23 మందిని బాబు చేరుకున్నారు.

    ఇప్పుడు కొత్త బిచ్చగాడు కేటీఆర్ కూస్తున్నాడు, ఏమి పీకబడలే! మొరిగే కుక్క కరవదు అనే సామెత గుర్తు లేదా బాసూ!

    BRS భవిష్యత్తు ప్రస్తుతం రేవంత్ దయా దాక్షిణ్యాల పైన ఆధారపడివుంది, కొంతకాలం ఎంత సైలెంట్ గా వుంటే అంత మంచిది ఆ పార్టీకి.

  4. లో గ డ అ న్న య్య నే ను గా నీ ఒ క వి జి ల్ వే సా ను అం టే చం ద్ర బా బు ఎం ఎల్ఏ లు నా వై పు కి వ స్తా రు, ప్ర భు త్వం కూ లి పో తుం ది అ ని రా జ్ భ వ న్ వ ద్ద కూసాడు, వై సీ పీ నుం డి 23 మం ది ని బా బు చే ర్చు కు న్నా రు.

    ఇప్పుడు కొత్త బిచ్చగాడు కేటీఆర్ కూస్తున్నాడు, ఏమి పీకబడలే! మొరిగే కుక్క కరవదు అనే సామెత గుర్తు లేదా బాసూ!

    BRS భవిష్యత్తు ప్రస్తుతం రేవంత్ దయా దాక్షిణ్యాల పైన ఆధారపడివుంది, కొంతకాలం ఎంత సైలెంట్ గా వుంటే అంత మంచిది ఆ పార్టీకి.

  5. లో గ డ అ న్న య్య నే ను గా నీ ఒ క వి జి ల్ వే సా ను అం టే చం ద్ర బా బు ఎం ఎల్ఏ లు నా వై పు కి వ స్తా రు, ప్ర భు త్వం కూ లి పో తుం ది అ ని రా జ్ భ వ న్ వ ద్ద కూసాడు, వై సీ పీ నుం డి 23 మం ది ని బా బు చే ర్చు కు న్నా రు.

    ఇ ప్పు డు కొ త్త బి చ్చ గా డు కే టీ ఆర్ కూ స్తు న్నా డు, ఏ మి పీ క బ డ లే! మొ రి గే కు క్క క ర వ దు అ నే సా మె త గు ర్తు లే దా బా సూ!

    B. R. S భ వి ష్య త్తు ప్ర స్తు తం రే వం త్ ద యా దా క్షి ణ్యా ల పైన ఆ ధా రప డి వుం ది, కొం త కా లం ఎం త సై లెం ట్ గా వుం టే అం త మం చి ది ఆ పా ర్టీ కి.

    1. ఇదే కామెంట్ స్పేస్ లేకుండా పోస్ట్ చేస్తే మోడరేషన్ కి వెళ్తోంది, ఏముందిరా ఇందులో GA! నువ్వు పిసుక్కోవటానికి! ఏదో జరిగిపోయినట్లు!

    2. ఇదే కామెంట్ స్పేస్ లేకుండా పోస్ట్ చేస్తే మోడరేషన్ కి వెళ్తోంది. ఇందులో నువ్వు పిసుక్కునేంత మ్యాటర్ ఏమైందిరా?

  6. ఒకవేళ పొంగులేటి అలా చేయాలని చూస్తే ఆయన్ని ఎక్కడ ఎంత నొక్కాలో తెలిసినవాళ్ళు చాలామంది వున్నారులే నువ్వు కంగారు పడబోక.

  7. జగన్ ఆంధ్రలో నెగ్గి ఉంటే ఈపాటికే రేవంత్ మాజీ అయ్యేవాడు. కోమటి, పొంగులేటి ఇద్దరూ రేవంత్ పక్కలో బల్లాలే. ఇపుడు కూడా కాంగ్రెస్లో కుర్చిలాట సాగుతూనే ఉంది. ఆంధ్రలో పవన్ ఎలాగో తెలంగాణలో భట్టి కూడా ఒక extra లగేజీ

  8. అ!రే!య్ కేటీఆర్ గా ఫార్మ్ హౌస్ లో రకుల్ ప్రీత్ సింగ్ ని , సమంత ని ఏమి చేసావు రా కచరా లం కొ!డ!కా

Comments are closed.