హీరోయిన్లకు, మరీ ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్లకు ఇది గుడ్ న్యూస్. బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్ సిగరెట్ మానేశాడు. ఈ విషయాన్ని అతడు స్వయంగా ప్రకటించాడు.
తన 59వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్న షారూక్ ఖాన్.. ఫ్రెండ్స్ కు ఇచ్చిన పార్టీలో ఈ విషయాన్ని వెల్లడించాడు. తను సిగరెట్లు తాగడం మానేశానని, ప్రస్తుతం ఆరోగ్యం బాగుందని ప్రకటించాడు. దీంతో అంతా ఒక్కసారిగా చప్పట్లు కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
షారూక్ తో సినిమా అంటే హీరోయిన్లు ముందుగా భయపడేది ఆ సిగరెట్ల కంపు గురించే. ఎవరైనా షాట్ గ్యాప్ లో సిగరెట్ తాగుతారు. కానీ షారూక్ మాత్రం టేక్ కు టేక్ కు మధ్య సిగరెట్ తాగేస్తుంటాడు. అలా రోజుకు 30 సిగరెట్లు తాగిన సందర్భాలూ ఉన్నాయి.
ఇలాంటి హీరోతో కలిసి నటించినప్పుడు భయంకరమైన వాసన వచ్చేది. ఇక రొమాంటిక్ సన్నివేశాల్లోనైతే ఆ కంపును భరిస్తూ నటించడం హీరోయిన్లకు అతిపెద్ద టాస్క్. ఇదే విషయాన్ని గతంలో కత్రినాకైఫ్, దీపిక లాంటి హీరోయిన్లు మొహమాటంలేకుండా బయటపెట్టారు.
షారూక్ కూడా తన స్మోకింగ్ విషయాన్ని ఎప్పుడు దాచిపెట్టలేదు. తను ఛెయిన్ స్మోకర్ అనే విషయాన్ని అతడు అంగీకరించాడు. ఇలాంటి వ్యక్తి ఉన్నఫలంగా సిగరెట్లు మానేశాడు. దీనికి కారణం అతడికి బ్రీతింగ్ సమస్యలు తలెత్తడమే. ఇప్పటికీ శ్వాసలో ఇబ్బంది ఉందని, గతంతో పోలిస్తే మెరుగైందని చెబుతున్నాడు ఈ స్టార్
Juhi Chawla has no problem with the smoking smell? Her mouth odor was much pungent?
smoking chesevallu twaraga musali vallavutaru.. veedela tappinchukunnadu?? veeniki 60 samvatsaralu mari..
Call boy jobs available 9989793850
vc estanu 9380537747