ట్విస్టుల మీద ట్విస్టులు చూస్తారు

పెద్ద పెద్ద ఆర్టిస్టులు నటించిన ఈ సినిమా, డేట్స్ సెట్ అవ్వకపోవడం వల్లనే లేట్ అయిందని చెప్పుకొచ్చాడు.

గేమ్ ఛేంజర్ ఎలా ఉండబోతోందనేది అందరికీ ఓ ఐడియా ఉంది. రామ్ చరణ్ లుక్ తో పాటు, ఆయన పాత్రపై కూడా అవగాహన ఉంది. అయితే ఎవరెన్ని రకాలుగా ఊహించుకున్నప్పటికీ, అంతకుమించి సినిమా ఉంటుందంటున్నాడు శ్రీకాంత్.

గేమ్ ఛేంజర్ లో కీలక పాత్ర పోషించిన ఈ నటుడు, సినిమాలో ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయని చెబుతున్నాడు. ఎట్టిపరిస్థితుల్లో మిస్ ఫైర్ అవ్వదంటున్నాడు.

“ప్రస్తుతం ఎలివేషన్స్‌తో పాటు కథను చెబితే బాగా ఆదరిస్తున్నారు. కొన్ని చిత్రాలు ఎలివేషన్స్‌తోనే ఆడుతున్నాయి. ఈ చిత్రంలో కథతో పాటు ఎలివేషన్స్ ఉంటాయి. ఈ మధ్య శంకర్ తీసిన చిత్రాలు మిస్ ఫైర్ అయి ఉండొచ్చు. కానీ ఇది మాత్రం అస్సలు మిస్ ఫైర్ కాదు. ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి.”

గేమ్ ఛేంజర్ కు సీక్వెల్ వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశాడు శ్రీకాంత్. అటు సినిమా షూటింగ్ లేట్ అవ్వడంపై కూడా స్పందించాడు. పెద్ద పెద్ద ఆర్టిస్టులు నటించిన ఈ సినిమా, డేట్స్ సెట్ అవ్వకపోవడం వల్లనే లేట్ అయిందని చెప్పుకొచ్చాడు. తన విషయానికే వస్తే, దేవర షూట్ లో ఉన్నప్పుడు గేమ్ ఛేంజర్ డేట్స్ అడిగారని, ఎడ్జెస్ట్ చేయడం చాలా ఇబ్బంది అయిందన్నాడు.

సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లలోకి రాబోతోంది గేమ్ ఛేంజర్ సినిమా. ఈ సినిమాలో ఆఫీసర్ రోల్ కాకుండా.. అప్పన్న అనే మాస్ పాత్రను పోషించాడు చరణ్. సినిమాకు ఆ పాత్రే హైలెట్ అంటున్నాడు శ్రీకాంత్.

6 Replies to “ట్విస్టుల మీద ట్విస్టులు చూస్తారు”

  1. పెద్ద యాక్టర్ల?😂😂😂ఎవరున్నారు?ప్రేక్షకులు తన్ని మూలన పడేసిన శ్రీకాంత్ పెద్ద యాక్టరా?పాపం దిల్ రాజుకు ట్విస్టులు ఉంటాయి లే ….రిటైర్డ్ కి దగ్గరైన శంకర్ టు సినిమా అంటే అర్థం అయింది …ఇంకో ఇండియన్ 2 అని ….

Comments are closed.