Advertisement

Advertisement


Home > Movies - Movie News

గని లుక్...చమక్

గని లుక్...చమక్

యుద్ద వీరుడు అంటే ఎలా వుండాలి. కమెడియన్ లా నవ్వుతూ కాదు, బెబ్బులి లా చురకత్తుల చూపులు చూస్తూ. అలాగే వచ్చాడు ఫస్ట్ లుక్ తో హీరో వరుణ్ తేజ్.

బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో వరుణ్ తేజ్ చేస్తున్న సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ వదిలారు. గని అనే టైటిల్ మెగాభిమానులకు బాగానే కనెక్ట్ కావచ్చు.

ఎందుకంటే వాళ్ల అభిమాన హీరో పవన్ కళ్యాణ్ ఓ సినిమాలో చేసిన పవర్ ఫుల్ క్యారెక్టర్ పేరు అదే కదా.ఆ సంగతి పక్కన పెడితే బాక్సింగ్ బరిలో పంచ్ విసురుతూ వరుణ్ చూసిన చూపులు పక్కా ఓ ఫైటర్ లుక్స్ లాగే వున్నాయి.

అంతే తప్ప ఫోటో షూట్ చేసి వదిలిన సినిమాటిక్ లుక్స్ లా లేవు. కిరణ్ కొర్రపాటి డైరక్షన్ లో అల్లు వెంకటేష్ తదితరులు నిర్మిస్తున్న ఈ సినిమా పోస్ట్ సమ్మర్ విడుదల దిశగా ముస్తాబవుతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?