గుంటూరు కారం.. అసలు టాస్క్ ఇకపై

పండగ హడావుడి చాలా వరకు ముగిసినట్లే. ఇక రేపటి నుంచి ఎక్కడి జనాలు అక్కడికి.. ఎవరి ఉద్యోగాలు వారికి. అయితే కొంతలో కొంత అదృష్టం ఏమిటంటే, ఈ వారాంతం కూడా కొంచెం కలెక్షన్లు కళ్ల…

పండగ హడావుడి చాలా వరకు ముగిసినట్లే. ఇక రేపటి నుంచి ఎక్కడి జనాలు అక్కడికి.. ఎవరి ఉద్యోగాలు వారికి. అయితే కొంతలో కొంత అదృష్టం ఏమిటంటే, ఈ వారాంతం కూడా కొంచెం కలెక్షన్లు కళ్ల చూడడానికి అవకాశం వుండడం. 

సినిమాకు ముందుగా వచ్చిన బజ్ వల్లనైతేనేమి, పండగ కారణం అయితే నేమి?  టికెట్ రేట్ల పెంపు కలసి రావడం, మొత్తానికి గుంటూరు కారం సినిమా సగం డబ్బులు వెనక్కు తెచ్చుకుంది.

ఆంధ్ర 48 కోట్ల మేరకు, నైజాం 40 కోట్ల మేరకు సీడెడ్ 15 కోట్ల మేరకు విక్రయించారు. ఈ మెత్తాల్లో దగ్గర దగ్గర సగం వరకు రిక‌వరీ సాధించింది. ఇక మిగిలిన సగం రాబట్టాల్సి వుంది. అదేమంత చిన్న విషయం కాదు. నైజాం మరో నలభై కోట్ల మేరకు వసూళ్లు సాగిస్తే, జిఎస్టీ మిగిలే అవకాశం వుంది. ఆపై ఖర్చులు, కమిషన్ సంగతి చూడాల్సి వుంటుంది.

ఆంధ్ర కూడా అదే పరిస్థితి ప్రతి ఏరియాలో సగానికి సగం ఇంకా రాబట్టాలి. కానీ అదేమంత ఈజీ టాస్క్ కాదు. ఉత్తరాంధ్ర మరో ఆరు కోట్లు రాబట్టాలంటే ఏమనుకోవాలి. ఇదే పరిస్థితి ప్రతి ఏరియాలో వుంది.

రేపటి నుంచి కిందకు జారకుండా వుంటే అదృష్టమే. కానీ పండగ వేళ ఈ సినిమాకు దొరక్క పోతే ఆ సినిమా అనే లెక్కలు వుంటాయి. కానీ పండగ తరువాత అలాంటి లెక్కలు వుండవు. పైగా ఇక థియేటర్లు తగ్గించడం మొదలవుతుంది. టికెట్ రేట్లు తగ్గించడం మొదలవుతుంది. బాగున్న సినిమాకు థియేటర్లు పెరగడం మొదలవుతుంది.

ఇన్ని ఈక్వేషన్ల నడుమ గుంటూరు కారం తీరం దాటడం అంత ఈజీ టాస్క్ కాదు. పైగా నిర్మాత పాతిక కోట్ల మేరకు జిఎస్టీలే వెనక్కు ఇచ్చుకోవాల్సి వుంటుంది. విడుదల నాటికే ఆంధ్రలో దగ్గర దగ్గర నాలుగు, నైజాం అయిదు, సీడెడ్ రెండు కోట్ల మేరకు తక్కువకు ఇవ్వాల్సి వచ్చింది. ఆ పదకొండు కోట్లకు ఈ జిఎస్టీ అదనం అవుతుంది.

ఇంత క్రేజీ ప్రాజెక్ట్ చేసి, గట్టిగా ఏమీ మిగలకపోగా, ఫ్లాపు సినిమా అన్నది బ్యానర్ ప్రొఫైల్ లో యాడ్ కావడం బ్యాడ్ లక్ కాకపోతే మరేంటి?