గురువారమే మరణిస్తా

సీనియర్ నటి, దర్శకురాలు విజయనిర్మల తన 73 ఏళ్ల వయసులో అస్వస్థతతో మరణించారు. గత కొద్ది రోజులుగా ఆమె అస్వస్థురాలై వున్నారు. ఈ సమయంలో ఆమె విల్ పవర్ ను తెలియచెప్పే విషయం ఒకటి…

సీనియర్ నటి, దర్శకురాలు విజయనిర్మల తన 73 ఏళ్ల వయసులో అస్వస్థతతో మరణించారు. గత కొద్ది రోజులుగా ఆమె అస్వస్థురాలై వున్నారు. ఈ సమయంలో ఆమె విల్ పవర్ ను తెలియచెప్పే విషయం ఒకటి తెలుస్తోంది. సాధారణంగా ఎంత అస్వస్థతకు గురైనా డాక్టర్లు పేషెంట్లకు ధైర్యం చెప్పడం మామూలే. అదే క్రమంలో విజయనిర్మలకు ట్రీట్ మెంట్ చేస్తున్న డాక్టర్లు ఆమెకు ఏం ఫరవాలేదు అని చెప్పేవారట. 

దానికి బదులుగా విజయనిర్మల, '..పోవడం, పోకపోవడం సంగతి అలా వుంచండి..కానీ ఎప్పుడు పోయినా గురువారం నాడే జరుగుతుంది. నేను గురువారమే మరణిస్తా..' అని చెప్పేవారట. సాయి బాబా భక్తురాలైన విజయనిర్మలకు గురువారం అంటే చాలా ప్రీతి. అందుకే అలా అనేవారని తెలుస్తోంది. ఆమె విల్ పవర్ కారణంగా కావచ్చు, తెల్లవారితే గురువారం అనగానే ఆమె మరణించారు. ఇలాంటి ఇచ్చామరణం లాంటి వరం ఎందరికో కానీ రాదు.

ఆ మనవడంటే ప్రేమ
విజయనిర్మలకు మనవడు నవీన్ అంటే ప్రేమ ఎక్కువ. ఇద్దరు మనవలు వున్నా నవీన్ అంటే ఎక్కవ ఇష్టం అనే తెలుస్తోంది. ఎంత ఇష్టం అంటే కొడుకు నరేష్ ను, మరో మనవడిని కాదని, తన ఆస్తి అధికభాగం నవీన్ కే చెందేలా వీలు రాసినట్ల బోగట్టా. విజయనిర్మలకు ముందుచూపు ఎక్కువ. ఆ రోజుల్లోనే నానక్ రామ్ గుడా ప్రాంతంలో మంచి పెట్టుబడులు పెట్టారు. ఆర్థికంగా ఆమె ఆ తరం హీరోలు, హీరోయిన్ల కన్నా చాలా బలంగా వున్నారు. ఈ వయసులో కూడా ఆమె తనకు ఏ లోటూ రాకూడదని ముందుగానే ఆలోచించి, జాగ్రత్తపడ్డారు.

శోకసంద్రంలో కృష్ణ
గత రెండు దశాబ్దాలుగా హీరో కృష్ణను కానీ, విజయనిర్మలను కానీ ఒంటరిగా చూసిన వారు లేరు. ఇంట్లోంచి బయట వరండాలోకి రావాలన్నా, ఏ ఫంక్షన్ కు, ప్రివ్యూలకు రావాలన్నా ఒకరి ఆసరాతో మరొకరు వుండాల్సిందే. విడిగా ఒక్కరూ కనిపించిన దృష్ట్యాంతం లేదు. ఇటీవలే కృష్ణకు కూడా చిన్న గాయం అయింది. ఆయన గురించే ఎక్కువ టెన్షన్ పడ్డారు విజయనిర్మల. ఇప్పుడు ఆమె లేరు అని తెలిసిన దగ్గర నుంచి కృష్ణ శోకాన్ని ఆపడం బంధు బలగానికి కష్టంగా వుంది. ఒకదశలో ఆయన తలను టేబుల్ కి కొట్టేసుకున్నట్లు తెలుస్తోంది.  

జగన్‌ విషయంలో కూడా ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు?