స్థలం పాతది.. గొడవ కొత్తది

తనే ఈ సమస్యను పరిష్కరించమని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. నిజానికి హీరోది చాలా అంటే చాలా పలుకుబఢి వున్న కుటుంబం కనుక పెద్దగా ఇబ్బంది పడక్కరలేదు. కానీ ఎందుకో మరి ఇలా?

సినిమా ఇండస్ట్రీతో సంబంధాలున్న ఓ ‘మంచి’ రియల్ ఎస్టేట్ వ్యక్తిని, ఓ యంగ్ టాప్ హీరో ఓ స్టూడియోకి పిలిచి, దాదాపు కొట్టినంత పని చేసి, అతగాడి కారు స్వాధీనం చేసుకుని, కొన్ని కాగితాల మీద సంతకాలు తీసుకున్నారంటూ ‘గ్రేట్ ఆంధ్ర’లో వచ్చిన గ్యాసిప్, ఇండస్ట్రీలో కాస్త కలం రేపింది. దీంతో కొందరు ఫోన్ చేసి మరి కొన్ని వివరాలు అందించారు.

ఈ వ్యవహారం ఈనాది కాదట. ఆ యంగ్ హీరో ఫ్యామిలీకి ఈ రియల్ ఎస్టేట్ వ్యక్తిని మరో హీరో పరిచయం చేసారు. దాంతో కొన్ని ఆస్తులు ఈ రియల్ ఎస్టేట్ ఆసామీ ద్వారా కొన్నారు. ఇది జరిగిపోయింది.

తమ ఆస్తులు కదా ఎవరు టచ్ చేస్తారు అనుకున్నారేమో, అలా వదిలేసారు. ఇటీవల ఎందుకో అన్ని ఆస్తులు చూసుకుంటూ, చెక్ చేసుకుంటూ వుంటే వీటితో ఏదో సమస్య వున్నట్లు తెలిసింది. ఎవరో జెండా పాతారో, డాక్యుమెంట్స్ సృష్టించారో మరి.

దాంతో సదరు హీరో ఆ రియల్ ఎస్టేట్ వ్యక్తికి కబురు చేసి, అతగాడి ఖరీదైన పోర్చ్ కారు ను స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. తనే ఈ సమస్యను పరిష్కరించమని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. నిజానికి హీరోది చాలా అంటే చాలా పలుకుబఢి వున్న కుటుంబం కనుక పెద్దగా ఇబ్బంది పడక్కరలేదు. కానీ ఎందుకో మరి ఇలా?

11 Replies to “స్థలం పాతది.. గొడవ కొత్తది”

Comments are closed.