రియల్ ఎస్టేట్ VS టాప్ హీరో

ఓ స్టూడియోలో వుండి, ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ ఓనర్ కు ఫోన్ చేసి, గట్టి వార్నింగ్ ఇచ్చి, రప్పించి, కొన్ని కాగితాల మీద, చెక్కుల మీద సంతకాలు తీసుకుని..

రియల్ ఎస్టేట్ అంటేనే పెద్ద రొచ్చు. లాభాలు బాగానే వుంటాయి కానీ తేడా వస్తే మాత్రం గొడవలు జరిగిపోతాయి. ఎన్ని రియల్ ఎస్టేట్ సంఘటనల్లో కిడ్నాప్ లు, బెదిరింపులు నుంచి మర్డర్ల వరకు సంఘటనలు జరగడం చూడలేదు. టాలీవుడ్ లో కూడా రియల్ ఎస్టేట్ వ్యవహారాలు చాలా ఎక్కువ. ముఖ్యంగా హీరోలకు వచ్చే కోట్లకు కోట్ల డబ్బును మళ్లించేది రియల్ ఎస్టేట్ లోకే. పైగా ఈ రెమ్యూరేషన్ లో బ్లాక్ పార్ట్ గట్టిగానే వుంటుంది కూడా. అందుకే రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు బాగా వుంటాయి. కానీ ఇక్కడ కూడా మోసాలు, తేడాలు వుండడం, గొడవలు జరగడం కామన్.

టాలీవుడ్ కు సంబంధించిన ఓ టాప్ హీరో పెట్టుబడి కూడా ఇలా వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఒక యంగ్ టాప్ హీరో టాలీవుడ్ లో చాలా మందికి పరిచయం అయిన పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ ద్వారా ఆంధ్రలోని ఓ పెద్ద పట్టణంలో పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆ భూమి వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

దీంతో సిటీలోని ఓ స్టూడియోలో వుండి, ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ ఓనర్ కు ఫోన్ చేసి, గట్టి వార్నింగ్ ఇచ్చి, రప్పించి, కొన్ని కాగితాల మీద, చెక్కుల మీద సంతకాలు తీసుకుని, అతగాడి కారు స్వాధీనం చేసుకుని పంపినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ విషయం టాలీవుడ్ లో గుసగుసలకు దారి తీసింది. త్వరలో బయటకు వస్తుందని వినిపిస్తోంది.

14 Replies to “రియల్ ఎస్టేట్ VS టాప్ హీరో”

Comments are closed.