బోయపాటి డేట్స్‌ను అలా వాడతారా?

ఇటీవల మీడియాతో మాట్లాడినప్పుడూ సరదాగా, “మనం మంచి యాక్షన్ సినిమా ప్లాన్ చేస్తున్నామని చెప్పలేదా?” అంటూ చైతన్యతో కలిసి ఒక సంకేతం ఇచ్చారు.

గీతా సంస్థలో దర్శకుడు బోయపాటి ఓ సినిమా చేయాల్సి ఉంది. అది ఎప్పటి నుంచో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ప్రస్తుతం బోయపాటి అఖండ 2 సినిమా మీద బిజీగా ఉన్నారు. దాని తర్వాత ఏ సినిమా చేయనున్నారన్నది ఇప్పుడే ఆయనకు తెలియదు. అప్పటి పరిస్థితులు, హీరోల అవైలబిలిటీపై ఆధారపడి ఉంటుంది.

అయితే, గీతా సంస్థ అధినేత అల్లు అరవింద్ మదిలో బోయపాటిని అక్కినేని హీరోతో క‌లిపితే బాగుంటుందనే ఆలోచన ఉందట. గీతా సంస్థలో నాగ చైతన్య రెండో సినిమా తండేల్. మొదటిది 100% లవ్. రెండు హిట్ సినిమాలే. అయితే, ఈసారి చైతన్యతో మంచి మాస్ సినిమా చేయాలని అరవింద్ భావిస్తున్నట్లు సమాచారం.

ఇటీవల మీడియాతో మాట్లాడినప్పుడూ సరదాగా, “మనం మంచి యాక్షన్ సినిమా ప్లాన్ చేస్తున్నామని చెప్పలేదా?” అంటూ చైతన్యతో కలిసి ఒక సంకేతం ఇచ్చారు.

అది యాదృచ్ఛికంగా వచ్చిన మాట కాదని, బోయపాటి ఓకే అంటే అక్కినేని హీరోతో మాస్ కథను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. పైగా, చైతన్యకు కూడా మాస్ సినిమాలంటే మహా ఇష్టం. తండేల్ తర్వాత చైతన్య ఓ థ్రిల్లర్ మూవీని భోగవల్లి ప్రసాద్ నిర్మాణంలో చేస్తున్నారు.

5 Replies to “బోయపాటి డేట్స్‌ను అలా వాడతారా?”

  1. Vaddu ra babu aa Boyapati gadni vadileyandi … Biyapati gadni Bali gadi meedaki pampandi…same script .. same dialogues tho rotta cinema teesukuntaru vallu . Bali gadi fans chustaru as usual ga 😛

Comments are closed.