చైతూ పాన్ ఇండియా కలలకు బ్రేక్?

తండేల్ హిందీ వెర్షన్ కు పేలవమైన రివ్యూస్ రావడమే కాదు, వసూళ్లు కూడా అలానే ఉన్నాయి.

వీకెండ్ ముగిసింది. తండేల్ రిజల్ట్ ఏంటనేది తేలిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ, మూవీ నిలబడింది. మంచి ప్రదర్శన కనబరుస్తోంది. పాకిస్థాన్ ఎపిసోడ్స్ పై అభ్యంతరాలున్నప్పటికీ సినిమా సక్సెస్ అయింది.

అయితే ఈ సినిమా నాగచైతన్య కలలను నెరవేర్చలేకపోయింది. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు ఆశించాడు చైతూ. కార్తికేయ-2 లాంటి సినిమాను అందించిన చందు మొండేటి సహకారంతో నార్త్ లో కూడా పాపులర్ అవ్వాలనుకున్నాడు. కానీ అలా జరగలేదు.

తండేల్ హిందీ వెర్షన్ కు పేలవమైన రివ్యూస్ రావడమే కాదు, వసూళ్లు కూడా అలానే ఉన్నాయి. మొదటి రోజే ఆక్యుపెన్సీ లేక కొన్ని షోలు క్యాన్సిల్ అవ్వగా.. వీకెండ్ ముగిసేనాటికి తండేల్ హిందీ వెర్షన్ తేలిపోయింది. అలా చైతూ పాన్ ఇండియా కలలకు బ్రేక్ పడింది.

హిందీ పక్కనపెడితే, ఎన్నాళ్లనుంచో ఎదురుచూస్తున్న విజయాన్ని తండేల్ తో అందుకున్నాడు చైతూ. తను తీసుకున్న నిర్ణయం, పడిన శ్రమకు తగిన గుర్తింపు పొందాడు. ఉన్నఫలంగా పైరసీని అరికడితే ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని వసూళ్లు రావడం ఖాయం. విడుదలైన 3 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ.62.37 కోట్లు గ్రాస్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించుకున్నారు.

2 Replies to “చైతూ పాన్ ఇండియా కలలకు బ్రేక్?”

Comments are closed.