స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఏక‌గ్రీవాల‌కు చెల్లు!

ఇక‌పై ఏక‌గ్రీవాల పేరుతో ఎన్నిక‌లు జ‌ర‌గ‌కుండా చేయాల‌నే కుట్ర‌ల‌కు స్వ‌స్తి ప‌ల‌కాల్సిన అనివార్య ప‌రిస్థితి ఎదురైంది.

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఏక‌గ్రీవాల‌కు స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం బ్రేక్ వేసింది. ఇక‌పై ఏక‌గ్రీవాల పేరుతో ఎన్నిక‌లు జ‌ర‌గ‌కుండా చేయాల‌నే కుట్ర‌ల‌కు స్వ‌స్తి ప‌ల‌కాల్సిన అనివార్య ప‌రిస్థితి ఎదురైంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త పిటిష‌న్ల‌పై విచార‌ణ సంద‌ర్భంగా సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కేవ‌లం ఒకే ఒక్క‌రు నామినేష‌న్ వేశార‌ని, ఏక‌గ్రీవం అయ్యాయంటూ ఎన్నిక‌ల అధికారులు ప్ర‌క‌టిస్తూ వుంటారు. అలాగే ఏక‌గ్రీవ‌మ‌య్యే గ్రామ పంచాయ‌తీల‌కు ప్ర‌భుత్వాలు ప్రోత్సాహ‌కాలు ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే అధికార బ‌లాన్ని అడ్డం పెట్టుకుని, ప్ర‌త్య‌ర్థుల‌తో నామినేష‌న్లు వేయ‌నియ్య‌కుండా అడ్డుకుంటున్న దుర్మార్గాన్ని కొంత కాలంగా అంద‌రూ చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో అధికారంలో ఉన్న‌వాళ్ల‌కు సుప్రీం ఆదేశాలు గ‌ట్టి షాక్‌గా చెప్పొచ్చు.

ఒకే ఒక్క‌రు నామినేష‌న్ వేసిన‌ప్ప‌టికీ ఏక‌గ్రీవం అంటే కుద‌ర‌ద‌ని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది. నామినేష‌న్ ఒక్క‌రే వేసినా, నోటాపై ఎన్నిక‌లు జ‌ర‌పాల‌ని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ సంచ‌ల‌న తీర్పు ముఖ్యంగా అధికారంలో ఉన్న వాళ్ల‌కు కోలుకోలేని దెబ్బ అనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. స్థానిక సంస్థ‌ల్లో అరాచ‌కాల‌కు చ‌ర‌మ‌గీతం పాడేందుకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఉప‌క‌రిస్తాయ‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

5 Replies to “స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఏక‌గ్రీవాల‌కు చెల్లు!”

  1. ఈ తీర్పేదో 2020 లో వచ్చుంటే, సజావుగా ఎన్నికలు జరిగి, ప్రభుత్వం పై వ్యతిరేకత ఎంతో తెలిసేది. ఇప్పుడు పంగనామాలు రాకుండా కనీసం ప్రతిపక్ష నేత హోదా అయినా వచ్చుండేది. ఏమంటావ్ గ్యాసు వెంకీ??

Comments are closed.