గేమ్ ఛేంజర్ సినిమా ఫ్లాప్ అనే అర్థం వచ్చేలా చేసిన సైగలపై నిర్మాత అల్లు అరవింద్ స్పష్టత ఇచ్చారు. ఆరోజు ఉద్దేశపూర్వకంగా అలా అనలేదన్నారు.
దిల్ రాజును స్టేజ్ పైకి ఆహ్వానిస్తూ, గడిచిన వారం రోజుల్లో ఆయన ఎదుర్కొన్న ఐటీ దాడుల విషయాన్ని ప్రస్తావిస్తూ అలా అన్నానని అన్నారు. రామ్ చరణ్ ను తగ్గించే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదన్నారు.
“చరణ్ నాకు కొడుకులాంటోడు. నాకున్న ఏకైక మేనల్లుడు, అతడికి ఏకైక మేనమామను నేను. ఎమోషనల్ గా చెబుతున్నాను, దయచేసి మమ్మల్ని వదిలేయండి. చరణ్-నేను ఎక్సలెంట్ రిలేషన్ షిప్ లో ఉంటాం. దిల్ రాజు జీవితం గురించి చెబుతూ పొరపాటున నేను ఆ సైగ వాడాను. అలా వాడి ఉండకూడదు.”
గడిచిన 3 రోజులుగా అల్లు అరవింద్ ను ఈ అంశంపై మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా తనను అర్థం చేసుకొని ట్రోలింగ్ ఆపేయాలని కోరారు.
ఓ ఇంటర్వ్యూలో చిరుత సినిమాను వెరీ యావరేజ్ సినిమాగా చెప్పుకొచ్చారు అరవింద్. ఆ టైమ్ లో మగధీరతో చరణ్ కు బ్రేక్ ఇచ్చానని అన్నారు. ఈ వివాదంపై స్పందించడానికి అరవింద్ నిరాకరించారు. మెగాభిమానుల ట్రోలింగ్ పై తను ఎమోషనల్ గా స్పందించానని, మరో అంశంపై స్పందించి కొత్త స్టేట్ మెంట్స్ ఇవ్వదలుచుకోలేదన్నారు.
ప్లే బాయ్ వర్క్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
nenu cheppanu brother, anakunda cheppesarannamata
Mari yevaru cheseru sir