మొన్న శ్రీకాంత్.. ఇప్పుడు పృధ్వీ

పృధ్వీ నోటి దురుసు సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ఏ పార్టీలో ఉన్నా నోటికి పనిచెప్పే రకం. అలాంటి వ్యక్తికి మైక్ ఇవ్వకుండా ఉండాల్సింది. ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదు.

వయసు పెరగడం ఒక్కటే ప్రామాణికం కాదు. ఆ వ్యక్తి గుణగణాలేంటి.. ఆయన ప్రవర్తన ఏంటనేది తెలుసుకొని స్టేజ్ ఎక్కించాలి. ఎవర్ని పడితే వాళ్లను స్టేజ్ ఎక్కిస్తే మొదటికే మోసం వస్తుంది.

సినిమా ఫంక్షన్ అనగానే ఎవరు పడితే వాళ్లు స్టేజ్ పైకి వస్తుంటారు. అభిమాన హీరోతో ఫొటో దిగాలనుకునేవాళ్లు కొందరు.. స్టేజ్ పై ఎక్కామని గొప్పగా చెప్పుకునేవాళ్లు మరికొందరు.. ఇలాంటి వాళ్ల ఉత్సాహాన్ని కాదనలేం, వాళ్లను ఆపలేం కూడా.

కానీ ఎవరికి మైక్ ఇవ్వాలి.. ఎవరికి ఇవ్వకూడదనే నిర్ణయం మాత్రం పూర్తిగా యూనిట్, ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ చేతుల్లో ఉంటుంది. యాంకరమ్మ స్వయంగా పిలిచి చేతిలో మైక్ పెడుతుంది. అలా మైక్ అందుకునే వ్యక్తి ఏం మాట్లాడతాడు.. అతడి ట్రాక్ రికార్డ్ ఏంటనేది తెలుసుకోవాల్సిన బాధ్యత కచ్చితంగా యూనిట్ దే.

పృధ్వీ నోటి దురుసు సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ఏ పార్టీలో ఉన్నా నోటికి పనిచెప్పే రకం. అలాంటి వ్యక్తికి మైక్ ఇవ్వకుండా ఉండాల్సింది. ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదు.

ఇలాంటి వాళ్లు ఇండస్ట్రీలో మరికొందరు కూడా ఉన్నారు. మొన్నటికిమొన్న శ్రీకాంత్ అయ్యంగార్ చేసిన డ్యామేజీ చాలామందికి గుర్తుండే ఉంటుంది. ‘పొట్టేల్’ అనే సినిమా ప్రచారంలో రివ్యూయర్స్ పై అత్యంత నీచమైన కామెంట్స్ చేశాడు. దీంతో టోటల్ మీడియా ఆ సినిమాను పక్కనపెట్టింది. ఆ ఒక్కడి నోటి దురుసుకి పొట్టేల్ బలైపోయింది. ఆ తర్వాత అదే వ్యక్తి రాచరికం అనే సినిమా ప్రచారంలో మరోసారి మైక్ అందుకున్నాడు. నోటికొచ్చినట్టు మాట్లాడాడు.

ఇలా సినిమా ఫంక్షన్లలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసే బ్యాచ్ ను గుర్తించాలి. ముందుగానే వాళ్లను కట్టడి చేయాలి. తప్పదనుకుంటే వాళ్ల నోటికి తాళం వేసి స్టేజ్ ఎక్కించాలి. ఇండస్ట్రీలో ఈ పని ఎంత తొందరగా జరిగితే అంత మంచిది. లేదంటే.. మరిన్ని ‘లైలా’లు బలైపోతాయి.

28 Replies to “మొన్న శ్రీకాంత్.. ఇప్పుడు పృధ్వీ”

  1. ఈ నీతిసూక్తులు పాపం మన జగన్ రెడ్డి హయం లో ఆర్జీవీ కి కూడా చెప్పి ఉండాల్సింది..

    అప్పుడేమో చెడుగుడులు, కౌంటర్లతో చెలరేగారు.. ఇప్పుడు పోలీస్ స్టేషన్ ల చుట్టూ తిరుగుతున్నారు..

    ..

    చెప్పేవి శ్రీరంగ నీతులు.. దూరేవి దొమ్మరి గుడిసెలు..

      1. బుర్రలేని Raju..

        నేను రాజకీయాలను సినిమాలను కలిపి చూసి.. రెచ్చిపోయిన మూక గురించి రాసాను..

        అక్కడ ఆర్టికల్ కూడా అదే..

        ఎదో ఒకటి రాసేసి.. కౌంటర్ ఇచ్చేయాలనే ఏడుపు తప్పితే.. విషయాన్ని స్ట్రెయిట్ గా ఎదుర్కొనే జ్ఞానం నీకు, నీ నాయకుడికి, నీ పార్టీ కి లేనట్టుంది..

        ..

        ఇంకో విషయం.. మీ టైం వచ్చి వెళ్ళిపోయింది.. ఈ జన్మలో మీకు టైం రాదు.. రానివ్వం..

  2. నోటి దురుసు వాళ్ళని స్టేజి ఎక్కిస్తే వొచ్చే నష్టం సినిమాకే .. కానీ అమాత్యుల్ని చేస్తే ?

  3. మీకు బల్బ్ వెలిగే సమయానికి ఊరంతా చీకటైపోతుంది..ఇల్లంతా గుల్లైపోతుంది..

    ఇదే బుద్ధి మీకు ముందే ఉండుంటే వైసీపీ కి ఇంత నష్టం వాటిల్లేది కాదు.. ఇలాంటి వాళ్ళకి మైక్ ఇవ్వకపోయుంటే, వైసీపీ గెలవక పోయినా కనీసం ప్రతిపక్ష హోదాలో ఉండేది… ఒక సినిమా గురించి ఇంతగా బాధపడుతున్న మీరు ఇలాంటి వాళ్ళతో పార్టీ నాశనం అయిపోతుందని గ్రహించలేకపోవడం బాధాకరం..

    చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే బహుశా ఇదేనేమో

  4. పిచ్చి GA….మీ PAYMENT కుక్కలు ఈ boycott trends మన అన్నయ్య DP పెట్టుకుని చేయరు…..MB, AA, Jr DP లతో అందరి movies మీద విషం కక్కుతూ వుంటారు… దాని వల్ల ఆ heroes కి ఎంత negative ఐతె మీ బండారం అంత తొందరగా బైటికి వస్తుంది….wait chey….😂😂👍

  5. సినిమా బాగుంటే చూస్తారు లేదంటే లేదు ఈ పైడ్ హ్యాష్ టాగ్ లు ఎందుకు

      1. ఇద్దరు కొట్టుకుంటుంటే విడదీసేది పోయి మొబైల్ ఫోన్ తో అప్లోడ్ చేసి ఎంటర్టైన్మెంట్ పొందే సమాజం సార్, ఈ ఇష్యూ కూడా ఒక రోజే రేపటి కి మరో ఎంటర్టైన్మెంట్ కావాలి జనాలకి

  6. ఇదీ ఒకందుకు మంచిదే. ఇలా ఓ నాలుగైదు పెద్ద సిన్మాలు పోతే హీరోలు రెమ్యూనిరేషన్లు దిగొస్తాయి.. సామాన్యుడికి అందుబాటు లో ఉంటాయి

  7. ఇవే నీతులు ఒక సంవత్సరం ముందు కూడా చెప్పుండాల్సింది .. ఆర్జీవీ బాగుపడేవాడు

    1. 50ఏళ్ల ముందు బుద్ధి చెప్పి ఉంటే ముగ్గురు బాగుపడేవారు

      ఆ ముగ్గురు ఎవరో చెప్పాలా

    1. Already ban చేశారు ప్రజలు…

      అదే విషయాన్ని తిప్పి చెప్తున్నాడు

      Next friday థియోటర్స్ ఖాళీగా ఉంటాయి

      చూసుకోండి

Comments are closed.