దేవరకొండ కోసం హేమా హేమీలు

ఈ టీజర్ కోసం విజయ్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. టీజర్ లో టాప్ హీరోల వాయిస్ ఓవర్ తో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ఎలివేషన్లు వుంటాయి.

గౌతమ్ తిన్ననూరి లేటెస్ట్ సినిమా ఒకటి వుంది. సితార నిర్మాణం. విజయ్ దేవరకొండ హీరో. మాఫియా కింగ్ డమ్.. బ్యాక్ డ్రాప్ లో తయారవుతున్న ఈ భారీ సినిమా రెండు భాగాలుగా రాబోతోంది. ఈ సినిమా టైటిల్ ఇప్పటికి వరకు అనౌన్స్ చేయలేదు. 12న అనౌన్స్ చేయబోతున్నారు. ఈ సినిమా టీజర్ లో వాయిస్ ఓవర్ ను అతిరథ మహారథులైన హీరోలు రంగంలోకి దిగారు.

గౌతమ్ కు వున్న పేరు, నిర్మాణ సంస్థ సితార సంస్థ నిర్మాత నాగవంశీ పరిచయాలు అన్నీ కలిసి ఇది పాజిబుల్ చేసాయి. తెలుగులో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ చెప్పడం అంటే టీజర్ కు ఎంత క్రేజ్ తీసుకువస్తుంది అన్నది వివరంగా చెప్పక్కరలేదు. అలాగే తమిళంలో సూర్య, హిందీలో రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్ చెప్పారు.

ఈ టీజర్ కోసం విజయ్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. టీజర్ లో టాప్ హీరోల వాయిస్ ఓవర్ తో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ఎలివేషన్లు వుంటాయి. ఆ ఎలివేషన్ల తరువాత హీరో పాత్రను పరిచయం చేస్తారు. అనిరుధ్ బ్యాక్ గ్రవుండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణ అవుతుందని ప్రత్యేకంగా చెప్పక్కరలేదు కదా.

7 Replies to “దేవరకొండ కోసం హేమా హేమీలు”

  1. Nud cal estanu >>> తొమ్మిది, మూడు, ఎనిమిది, సున్న, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు.

  2. Nud call available >>>తొమ్మిది, సున్న, ఒకటి, తొమిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది

Comments are closed.