చారిత్రాత్మక డిజాస్టర్.. రష్మిక పరిస్థితేంటి?

ఇటు సౌత్ లో ఆమె నటించిన కుబేర సినిమా విడుదలకు సిద్ధమైంది. అది హిట్టయితే ఇంకొన్నాళ్లు ఆమె వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు.

సల్మాన్ ఖాన్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఏంటో తెలుసా? చాలా సినిమాలున్నాయి కానీ అన్నింటికంటే పెద్ద డిజాస్టర్ మాత్రం 2008లో వచ్చిన యువరాజ్ అనే సినిమా. సుభాశ్ ఘయ్ లాంటి దర్శకుడు, కత్రినా లాంటి అందగత్తె, రెహ్మాన్ లాంటి మ్యూజిక్ డైరక్టర్ ఉన్నప్పటికీ ఆ సినిమాను ఎవ్వరూ కాపాడలేకపోయారు.

మళ్లీ ఇన్నేళ్లకు యువరాజ్ సినిమాను తలదన్నే మూవీ చేశాడు సల్మాన్ ఖాన్. అదే సికిందర్. మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, సల్మాన్ కెరీర్ ను పదేళ్లు వెనక్కు తీసుకెళ్లిందని, స్వయంగా అతడి అభిమానులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలా సల్మాన్ కెరీర్ లో రెండో అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది సికిందర్ సినిమా.

ఇలాంటి సినిమాలో హీరోయిన్ గా నటించింది రష్మిక. దీంతో సహజంగానే ఆమెపై ఫ్లాప్ హీరోయిన్ అనే ముద్ర పడుతుంది. కానీ ఈ విషయంలో రష్మిక అదృష్టవంతురాలు. సికిందర్ ఫ్లాప్ ప్రభావం ముందుగా మురుగదాస్ పై, ఆ తర్వాత సల్మాన్ పై పడింది. ఈ సినిమా రిజల్ట్ విషయంలో ఎవ్వరూ రష్మికను తప్పుబట్టకపోవడం విశేషం, అది ఆమె అదృష్టం.

అయితే ఈ అదృష్టం ఆమెకు కొన్నాళ్లు మాత్రమే. ఈ గ్యాప్ లో ఆమె కచ్చితంగా హిట్ కొట్టాలి. లేదంటే ఐరెన్ లెగ్ ట్యాగ్ తగిలించడానికి ఏమాత్రం మొహమాటపడరు జనం. ఛావా సినిమా సక్సెస్ రష్మికను ఇంకా బాలీవుడ్ లో కాపాడుతోంది.

ఇటు సౌత్ లో ఆమె నటించిన కుబేర సినిమా విడుదలకు సిద్ధమైంది. అది హిట్టయితే ఇంకొన్నాళ్లు ఆమె వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు.

4 Replies to “చారిత్రాత్మక డిజాస్టర్.. రష్మిక పరిస్థితేంటి?”

  1. ​3 సూపర్ హిట్స్ (ఆనిమల్, పుష్ప, చావా) తర్వాత వొచ్చిన ఒక ఫెయిల్యూర్… అయినా “ఇప్పుడు హిట్ కొట్టకపోతే ఐరన్ లెగ్ టాగ్ తగిలిస్తారు” అంటున్నావు.

    తెలిసి రాస్తావో .. లేక పేజీలు ఫిల్ చేయడానికి ఏది పడితే అది రాస్తావో..!!

Comments are closed.