సమంతను గుర్తుచేస్తున్న కీర్తిసురేష్

కొన్నేళ్ల కిందట సమంత-నాగచైతన్య పెళ్లి గోవాలో జరిగిన సంగతి తెలిసిందే. అప్పట్లో హిందూ-క్రిస్టియన్ సంప్రదాయాల్లో వీళ్లు 2సార్లు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు కీర్తిసురేష్ కూడా అంతే.

సమంత గోవాలో పెళ్లి చేసుకుంది. ఇప్పుడు కీర్తిసురేష్ కూడా గోవాలోనే పెళ్లి చేసుకుంటోంది. అయితే వీళ్లిద్దరి పెళ్లిళ్ల మధ్య కామన్ పాయింట్ ఇది మాత్రమే కాదు.

కొన్నేళ్ల కిందట సమంత-నాగచైతన్య పెళ్లి గోవాలో జరిగిన సంగతి తెలిసిందే. అప్పట్లో హిందూ-క్రిస్టియన్ సంప్రదాయాల్లో వీళ్లు 2సార్లు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు కీర్తిసురేష్ కూడా అంతే.

ఆంటోనీ తటిల్ ను హిందూ-క్రిస్టియన్ సంప్రదాయాల్లో 2 సార్లు పెళ్లాడబోతోంది కీర్తిసురేష్. ముందుగా వీళ్ల పెళ్లి హిందూ సంప్రదాయంలో లగ్జరీ రిసార్ట్ లో జరుగుతుంది. అదే రోజు సాయంత్రం గోవాలోని ఓ చర్చిలో క్రిస్టియన్ పద్ధతిలో కూడా వివాహం జరుగుతుంది.

డిసెంబర్ 12 న కీర్తిసురేష్-ఆంటోనీ పెళ్లి జరగనుంది. 10వ తేదీ నుంచే పెళ్లి వేడుకలు మొదలుకాబోతున్నాయి. హల్డీ ఫంక్షన్ తో పాటు, సంగీత్, మెహందీ ఫంక్షన్లన్నీ ఉంటాయి.

8 Replies to “సమంతను గుర్తుచేస్తున్న కీర్తిసురేష్”

  1. శుభం పలకరా… అంటే… …

    అసలు మీకు ఈ పోలిక తేవాలి అని ఎందుకు అనిపించింది…

    అయినా రెండూ వేరు వేరు లెండి… అక్కడ అమ్మాయి క్రిస్టియన్ ఐతే ఇక్కడ అబ్బాయి..

Comments are closed.