సంక్రాంతి సినిమాలు శరవేగంగా సిద్ధమౌతున్నాయి. టైమ్ తక్కువగా ఉండడంతో, ఓవైపు షూటింగ్ పూర్తి చేస్తూనే, మరోవైపు ప్రచారాన్ని కూడా పరుగులు పెట్టిస్తున్నాయి. ఈ క్రమంలో బాలకృష్ణ సినిమా మరో అడుగు ముందుకేసింది.
బాబి దర్శకత్వంలో తెరకెక్కుతోంది ‘డాకు మహారాజ్’. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. సమాంతరంగా పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తోంది. సినిమా జనవరి 12కి కచ్చితంగా వస్తుందని మరోసారి ప్రకటించింది యూనిట్.
సంక్రాంతి బరిలో నిలిచిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా ఫస్ట్ కాపీ రెడీ చేసే పనిలో పడింది. ఇప్పుడు ‘డాకు మహారాజ్’ షూటింగ్ పూర్తి చేసుకుంది. మరో వారంలో వెంకీ నటిస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కూడా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది.
ప్రస్తుతానికైతే ప్రమోషన్స్ లో ‘గేమ్ ఛేంజర్’ ముందుంది. త్వరలోనే అమెరికాలో ప్రీ-రిలీజ్ ఫంక్షన్ నిర్వహించబోతున్నారు. ఆల్రెడీ 3 సాంగ్స్ రిలీజ్ చేశారు. ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఈమధ్యే పాటలతో ప్రచారం మొదలుపెట్టింది. రమణ గోగుల పాడిన ఫస్ట్ సింగిల్ హిట్టయింది. ప్రచారం విషయంలో ప్రస్తుతానికి ‘డాకు మహారాజ్’ వెనకబడి ఉంది.
జై. Balaiah
Call boy jobs available 7997531004
Nbk😁😁😁😁😁😁
Waiting NBK Daku maharaaj
Vc available 9380537747
Call boy works 7997531004