Advertisement

Advertisement


Home > Movies - Movie News

రియల్ లైఫ్ లో ఓసీడీ హీరోయిన్

రియల్ లైఫ్ లో ఓసీడీ హీరోయిన్

కొందరికి కొన్ని ఓసీడీలు ఉంటాయి. దీన్నే నిజజీవితంలో ఛాదస్తం అని కూడా అంటారు. ఇలాంటి ఓ ఛాదస్తం మెహ్రీన్ కు కూడా ఉంది. అదే అతి శుభ్రత. అవును.. ప్రతిది శుభ్రంగా ఉంచుకోవడం మెహ్రీన్ కు అలవాటు. 

ఒకటికి రెండు సార్లు ఇల్లు శుభ్రం చేయించడం, అదే పనిగా కారు శుభ్రం చేయించడం మెహ్రీన్ కు అలవాటు. దీంతో పాటు, వ్యక్తిగత శుభ్రత విషయంలో కూడా ఈ పిల్ల మరీ ఓవర్ గా ప్రవర్తిస్తుంటుంది.

మహానుభావుడు సినిమాలో హీరోకు ఈ అతిశుభ్రత అనే ఓసీడీ ఉంటుంది. కానీ నిజజీవితంలో హీరోయిన్ మెహ్రీన్ కు ఈ అతిశుభ్రత ఎక్కువ. ఈ విషయాన్ని ఆమె స్వయంగా బయటపెట్టింది.

"మహానుభావుడు సినిమాలో హీరోకు అతిశుభ్రత అనే ఓసీడీ ఉంటుంది. కానీ నాకు రియల్ లైఫ్ లో ఉంది. కరోనా వచ్చిన తర్వాత అంతా శానిటైజర్లు వాడుతున్నారు. కానీ నాకు చాలా ఏళ్లుగా శానిటైజర్ అలవాటు. అప్పట్లో నా బ్యాగ్ లో 2-3 శానిటైజర్ బాటిళ్లు ఉండేవి. ఇప్పుడు 6-7 ఉంటున్నాయి. చేతులు కడుక్కోకపోయినా, శానిటైజర్ రాసుకోకపోయినా నేను నా స్టాఫ్ తో మాట్లాడను. మేకప్ మేన్ అయితే చేతులు కడుక్కొని, శానిటైజర్ రాసుకున్న తర్వాతే నా ఫేస్ టచ్ చేయాలి. ఫస్ట్ నుంచి నేను ఇంతే."

ఇలా తన ఓసీడీని బయటపెట్టింది మెహ్రీన్. ఈ ముద్దుగుమ్మ నటించిన మంచి రోజులు వచ్చాయి సినిమా దీపావళి కానుకగా థియేటర్లలోకి వచ్చింది. ఇక ఎఫ్3 సినిమా త్వరలోనే థియేటర్లలోకి రాబోతోంది. ఈమధ్య తన పెళ్లిని రద్దు చేసుకున్న మెహ్రీన్, ఇకపై కెరీర్ పై మరింత ఫోకస్ పెంచుతానని ప్రకటించింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?