Advertisement

Advertisement


Home > Movies - Press Releases

మంచి రోజులు వచ్చాయి

మంచి రోజులు వచ్చాయి

మినిమమ్ గ్యారంటీ దర్శకుడు మారుతి.. కాన్సెప్ట్ లతో చిన్న సినిమాలు పెద్ద విజయాలు అందుకున్న యూవీ కాన్సెప్ట్స్.. నిర్మాత ఎస్కేఎన్ . కాంబినేషన్ లో వచ్చిన సినిమా మంచి రోజులు వచ్చాయి. దీపావళి పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమాకు డీసెంట్ కలెక్షన్స్ వస్తున్నాయి. 

బి సి సెంటర్లలో వచ్చిన టాక్ తో మంచి రోజులు వచ్చాయి బాక్సాఫీస్ దగ్గర ఓకె అనిపించుకుంటోంది. . వినోదంతో పాటు చిన్న సందేశం అందించే విధంగా మారుతి రాసుకున్న కథ ప్రేక్షకులకు చేరువయింది. 

కామెడీతో పాటు మనసును తాకే ఎమోషనల్ సన్నివేశాలు హీరో సంతోష్ శోభన్, మెహరీన్ కౌర్ మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు.. లవ్ స్టోరీ.. వాళ్ల కెమిస్ట్రీ అద్భుతంగా వర్కవుట్ అయింది.

అజయ్ ఘోష్ నటన సినిమాకు ప్రధాన బలంగా మారింది. సుదర్శన్, సప్తగిరి, వెన్నెల కిషోర్జ్ ప్రవీణ్, వైవా హర్ష కామెడీ సీన్స్ ప్రేక్షకులను నవ్విస్తూ ఉన్నాయి.  

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక మంచి సరదా సినిమా చూడాలి అనుకునే ప్రేక్షకులకు మంచి రోజులు వచ్చాయి కంటే బెస్ట్ ఆప్షన్ మరొకటి లేదు అంటోంది యూనిట్. సినిమా విజయం ఈ సందర్భంగా తెలుగు ప్రేక్షకులకు చిత్ర యూనిట్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?