హిట్ ఎంత కిక్ ఇస్తుందో, ఫ్లాప్ అంత కుంగదీస్తుంది. వరుసపెట్టి ఫెయిల్యూర్స్ వస్తే ఇక చెప్పేదేముంది. ప్రస్తుతం నాగశౌర్య అలాంటి ఇబ్బందుల్లోనే ఉన్నాడు.
వరుసగా ఫ్లాప్స్ రావడంతో ఎలాంటి కథ ఎంచుకోవాలో అర్థంకాక గ్యాప్ తీసుకున్నాడు. ఎట్టకేలకు ఓ సినిమాకు ఓకే చెప్పాడు. సెట్స్ పైకి కూడా వచ్చాడు.
ఆశ్చర్యంగా ఈసారి కూడా కొత్త దర్శకుడికే అవకాశం ఇచ్చాడు శౌర్య. రమేష్ అనే దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. చింతలపూడి శ్రీనివాసరావు నిర్మాత.
ఇంతకుముందు గౌతమ్ మీనన్, వైవీఎస్ చౌదరి, శ్రీనువైట్ల లాంటి దర్శకుల వద్ద పనిచేశాడు రమేశ్. ఆ అనుభవంతో ఓ కథ రాసుకున్నాడు. ఆ తర్వాత నాగశౌర్యతో కలిసి ఆ కథలో మార్పుచేర్పులు చేశాడు. అలా ఇద్దరూ కలిసి సెట్స్ పైకి వచ్చారు.
ఈ సినిమాలో సముద్రఖనిని విలన్ గా.. హరీశ్ జైరాజ్ ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. హీరోయిన్ ఎవరనేది ఇంకా చెప్పలేదు.
Vc available 9380537747
జనం పట్టించుకోరు