యాక్షన్ మూవీనా.. లవ్ సినిమానా..?

సినిమా జానర్ ఏదైనప్పటికీ, కథ కొత్తగా ఉంటుందని మాత్రం ఆశించొచ్చు. ఎందుకంటే, అది ప్రశాంత్ వర్మ సినిమా కాబట్టి.

బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అతడి సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రాసుకున్న కథతో మోక్షు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే మోక్షు లుక్ రిలీజైంది. ఎప్పుడైతే సినిమాను అధికారికంగా ప్రకటించారో.. ఆరోజే మోక్షజ్ఞ లుక్ కూడా రివీల్ చేశారు. ఇప్పుడు మరో ఫొటో వదిలాడు దర్శకుడు.

పూర్తిస్థాయిలో మేకోవర్ అయిన మోక్షజ్ఞ క్లోజప్ షాట్ ను ప్రశాంత్ వర్మ విడుదల చేశాడు. “యాక్షన్ కోసం సిద్ధమా..” అనే క్యాప్షన్ కూడా పెట్టాడు. అయితే ఇప్పుడీ లుక్ రిలీజ్ చేసిన తర్వాత ప్రాజెక్టుపై కొత్త చర్చ మొదలైంది.

ఈ లుక్ చూసిన చాలామంది లవ్ స్టోరీ చేస్తే బాగుంటుందని ఫీల్ అవ్వడం విశేషం. మరికొందరు మాత్రం తమ నందమూరి హీరోతో యాక్షన్ సినిమానే చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో మోక్షజ్ఞ సినిమాపై కొత్త చర్చ షురూ అయినట్టయింది.

సినిమా జానర్ ఏదైనప్పటికీ, కథ కొత్తగా ఉంటుందని మాత్రం ఆశించొచ్చు. ఎందుకంటే, అది ప్రశాంత్ వర్మ సినిమా కాబట్టి. పైగా మొదటి సినిమాకే మాస్ ఎలిమెంట్స్, భారీ ఎలివేషన్లు లాంటివి పెడితే ఈ కాలం వర్కవుట్ అవ్వదనే సంగతి ప్రశాంత్ కు తెలియంది కాదు.

8 Replies to “యాక్షన్ మూవీనా.. లవ్ సినిమానా..?”

Comments are closed.