నాగ‌బాబును రాజ్య‌స‌భ‌కు పంపేందుకు బాబు అంగీక‌రిస్తారా?

జ‌న‌సేన రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ అన్న నాగ‌బాబును రాజ్య‌స‌భ‌కు పంపుతారనే ప్ర‌చారం విస్తృతంగా సాగుతోంది. అయితే వైసీపీకి చెందిన ముగ్గురు రాజ్య‌స‌భ స‌భ్యులు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేయ‌డంతో ఆ…

జ‌న‌సేన రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ అన్న నాగ‌బాబును రాజ్య‌స‌భ‌కు పంపుతారనే ప్ర‌చారం విస్తృతంగా సాగుతోంది. అయితే వైసీపీకి చెందిన ముగ్గురు రాజ్య‌స‌భ స‌భ్యులు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేయ‌డంతో ఆ స్థానాలు ఖాళీ ఏర్ప‌డ్డాయి. ఇటీవ‌ల వాటి భ‌ర్తీకి ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

ఆ మూడు ప‌ద‌వులు కూట‌మికే ద‌క్క‌నున్నాయి. దీంతో ర‌క‌ర‌కాల వ్య‌క్తుల పేర్లు తెరపైకి వ‌చ్చాయి. ఇందులో భాగంగా జ‌న‌సేన నేత నాగ‌బాబు పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. అయితే నాగ‌బాబును రాజ్య‌స‌భ‌కు పంప‌డం అంటే జ‌న‌సేన‌కు అత్యున్న‌త చ‌ట్ట‌స‌భ‌లో ప్రాతినిథ్యం క‌ల్పించ‌డ‌మే. ఢిల్లీ స్థాయిలో జ‌న‌సేన‌కు ప్రాధాన్యం ఏర్ప‌డుతుంది. పేరుకు జ‌న‌సేన‌ను మిత్ర‌ప‌క్షంగా టీడీపీ భావిస్తున్న‌ప్ప‌టికీ, రాజ‌కీయంగా ఆ పార్టీని బ‌లోపేతం చేయాల‌ని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ చంద్ర‌బాబు అంగీక‌రించ‌రు.

ఇదిలా వుండ‌గా త‌న‌కు రాజ్య‌స‌భ ఇస్తార‌నే ప్ర‌చారం నేప‌థ్యంలో నాగ‌బాబు చేసిన ట్వీట్ ఆస‌క్తిక‌రంగా మారింది. త‌న‌కెలాంటి రాజ‌కీయ ఆకాంక్ష‌లు లేవ‌ని నాగ‌బాబు పేర్కొన్నారు. నిస్వార్థ రాజ‌కీయ నాయ‌కుడైన త‌న సోద‌రుడు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ కోసం త‌న జీవితాన్ని త్యాగం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ఆయ‌న ట్వీట్ చేశారు. అయితే రాజ‌కీయాల్లో ఇలాంటివి స‌ర్వ‌సాధార‌ణ‌మే. ప‌ద‌వులు వ‌ద్ద‌ని పైకి అంటారే త‌ప్ప‌, ఇస్తే తీసుకోకుండా ఎవ‌రూ వుండ‌రు. అందుకే నాగ‌బాబును కామెంట్స్‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని జ‌న‌సేన నాయ‌కులు చెబుతున్నారు.

ఇప్ప‌టికే ప్ర‌తి విష‌యంలోనూ టీడీపీ, జ‌న‌సేన స‌మానం అన్న‌ట్టు రాజ‌కీయ వ్య‌వ‌హారాలు సాగుతున్నాయి. ఇదే పంథా కొన‌సాగితే మాత్రం రానున్న రోజుల్లో టీడీపీకి ఇబ్బందులు త‌ప్ప‌వు. గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌కు బ‌లం లేద‌నే ఉద్దేశంతో 21 అసెంబ్లీ సీట్లు, రెండు పార్ల‌మెంట్ స్థానాల‌తో ప‌వ‌న్ స‌రిపెట్టుకున్నారు. కానీ రానున్న రోజుల్లో ఇదే సంఖ్య‌కు ప‌వ‌న్ అంగీక‌రించే ప్ర‌శ్నే ఉత్ప‌న్నం కాదు. జ‌న‌సేన బ‌ల‌ప‌డాల‌ని చూస్తోంది.

అందుకే రాజ్య‌స‌భ సీటు కోసం ప‌వ‌న్ ప‌ట్టుబ‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. చంద్ర‌బాబుకు ప‌వ‌న్ రాజ‌కీయాలు తెలియ‌నంత అమాకుడేమీ కాదు. మ‌రోవైపు కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌ల వ‌ద్ద ప‌వ‌న్ పలుకుబ‌డి పెంచుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ప‌వ‌న్‌ను అడ్డు పెట్టుకుని బీజేపీ ఏపీలో త‌న‌దైన శైలిలో రాజ‌కీయాలు చేయాల‌ని అనుకుంటోంది. అందుకు త‌గ్గ‌ట్టుగా రాజ్య‌స‌భ సీటును నాగ‌బాబుకు ఇవ్వాల‌నే అంశాన్ని తెర‌పైకి తెస్తోంది. దీన్ని చంద్ర‌బాబు ఎలా అడ్డుకుంటారో చూడాలి. ఎందుకంటే, నాగ‌బాబును రాజ్య‌స‌భ‌కు పంప‌డం అంటే, జ‌న‌సేన‌ను బ‌ల‌ప‌ర‌చ‌డ‌మే.

12 Replies to “నాగ‌బాబును రాజ్య‌స‌భ‌కు పంపేందుకు బాబు అంగీక‌రిస్తారా?”

  1. వాళ్ళ కంటె నువ్వె ఎక్కవ బాడపడుతునట్టు ఉన్నవ్! ముందు మన అన్న కొసం ఎడువు!

  2. GA గారూ,

    మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక కఠోర నగ్న సత్యం.

    అనివార్యం గా అయినా తెదేపా JSP ఎదుగుదలకు సహకరిస్తుంది. ఎందుకు అంటారేమో… ఇప్పుడు తెదేపా ముఖ్య ప్రాధాన్యత .. వైకాపా నిర్వీర్యం కావడం. దానికి JSP సహకారం అవసరం.( ఈ వాక్యానికి తెదేపా అభిమానులు ఒప్పుకున్నా, ఒప్పుకోకున్నా). Once the Target is completed… తెదేపా may look at JSP if required.. based on situations at that time.

Comments are closed.