ఏపీ స‌చివాల‌య ఉద్యోగుల సంఘం నేత వెంక‌ట్రామిరెడ్డి అరెస్ట్‌!

ఏపీ స‌చివాల‌య ఉద్యోగుల సంఘం నేత వెంక‌ట్రామిరెడ్డిని స‌స్పెండ్ చేయ‌డంతోనే కూట‌మి స‌ర్కార్ సంతృప్తి చెంద‌లేదు.

ఏపీ స‌చివాల‌య ఉద్యోగుల సంఘం నేత వెంక‌ట్రామిరెడ్డిని స‌స్పెండ్ చేయ‌డంతోనే కూట‌మి స‌ర్కార్ సంతృప్తి చెంద‌లేదు. తాజాగా ఆయ‌న్ను అరెస్ట్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అధికారం వుంటే రూల్స్ ఏవీ పాటించాల్సిన అవ‌స‌రం లేద‌నే రీతిలో వ్య‌వ‌హారాలు న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇబ్బందుల‌ల్లా కేవ‌లం ప్ర‌భుత్వ వ్య‌తిరేకుల‌కే అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

వెంక‌ట్రామిరెడ్డి అరెస్ట్‌కు దారి తీసిన ప‌రిస్థితుల గురించి తెలుసుకుందాం. స‌చివాల‌యం క్యాంటీన్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. 10 డైరెక్ట‌ర్ ప‌ద‌వుల కోసం 28 మంది త‌ల‌ప‌డుతున్నారు. స‌చివాల‌య ఉద్యోగుల సంఘం అధ్య‌క్షుడు వెంక‌ట్రామిరెడ్డి వ‌ర్గం నుంచి 11 మంది బ‌రిలో ఉన్నారు. త‌న వాళ్ల‌ను గెలిపించుకోడానికి వెంక‌ట్రామిరెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని కొండపావులూరి గార్డెన్‌లో ఉద్యోగులకు మందు పార్టీ ఏర్పాటు చేశారు.

అయితే అనుమ‌తి లేనిదే మందు, విందు పార్టీ ఏర్పాటు చేశార‌నే స‌మాచారాన్ని ఎక్సైజ్ పోలీసులకు కొంద‌రు అందించారు. దీంతో గురువారం అర్ధ‌రాత్రి ఎక్సైజ్ అధికారులు దాడి చేశారు. మ‌ద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. దీనంత‌టికి కార‌కుడిగా వెంక‌ట్రామిరెడ్డిని గుర్తించి, ఆయ‌న్ను అరెస్ట్ చేయ‌డం గ‌మ‌నార్హం.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున వెంక‌ట్రామిరెడ్డి ప్ర‌చారం చేశార‌ని ఆయ‌న్ను ప్ర‌భుత్వం స‌స్పెండ్ చేసింది. ఇప్పుడు ఆయ‌న్ను అరెస్ట్ కూడా చేయ‌డం ఉద్యోగ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

11 Replies to “ఏపీ స‌చివాల‌య ఉద్యోగుల సంఘం నేత వెంక‌ట్రామిరెడ్డి అరెస్ట్‌!”

  1. అబ్బొ! Y.-.C.-.P ని చూసుకొని అప్పట్లొ ఈయన చెసిన ఒవెర్ యాక్షన్ అంతా ఇంతా కాదు!

    మొత్తం మీద మందు పంచుతూ దొరికాడు అంటావ్!

  2. డాక్టర్ గారూ, మా ఆయన మొహం పీక్కుపోయింది, జుట్టు గడ్డం నెరిసిపోయింది. కింగులా ఉండేవాడు బొంగులా అయ్యాడు..మామూలు మనిషి అవ్వాలంటే ఏం తినిపించాలి?

    డాక్టర్ : మీ ఆయన మళ్ళీ మామూలు అవ్వాలంటే జనాల డబ్బు తినిపించాలి. అదే ఆయన గ్లామర్ సీక్రెట్..

  3. అనుమతి లేకుండా మందు పార్టీ అని పోలీసులకి చెప్పింది ఎవరు?

    ఉద్యోగుల్లో చర్చ జరుగుతుంది… కానీ… మనం ఇలాంటి వాడిని నమ్ముకున్నాము అని

  4. జగన్ రెడ్డి మళ్ళీ జైలు సందర్శన కి సమయం వచ్చింది..

    నెక్స్ట్ వీక్ ఆంధ్ర కి రావడానికి .. ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం దొరికింది..

    ..

    ఈ మాత్రం దానికి “యాక్టీవ్” అయ్యాడని అనుకుంటే.. కొండెర్రిపప్పలు అనుకోవాలి.. అంతే.. మనమేమి చేయగలం..

  5. డిసెంబర్ నెలాఖరులోగా అమరావతి ఏపీకి రాజధాని అని కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. అదే కనుక జరిగితే అమరావతికి అదే అతి పెద్ద రాజముద్ర గా ఉంటుంది అని అంటున్నారు. అమరావతి రాజధానిని ఇక మీద ఎవరు అధికారంలోకి వచ్చినా కదిపేందుకు వీలు ఉండదని అంటున్నారు. ఆ విధంగా గట్టి బిగింపులతోనే కూటమి ప్రభుత్వం అమరావతిని ఏపీకి శాశ్వత రజాధానిగా చేయబోతోంది. దాని వల్ల పెట్టుబడులు పెట్టే వారికి పరిశ్రమలు స్థాపించేవారికి కూడా పూర్తి స్థాయిలో నమ్మకం వస్తుందని అంటున్నారు. ఒక్క గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ అయితే చాలు అమరావతి అభివృద్ధి పరుగులు పెడుతుందని అంటున్నారు. మొత్తానికి వైసీపీ నినాదం అయిన మూడు రాజధానుల ముచ్చట చరిత్రలోనే కలసిపోతుంది అని అంటున్నారు అమరావతి ఏపీకి ఎప్పటికీ శాశ్వత రాజధానిగా ఉండబోతోంది అని అంటున్నారు. దాంతో ఎవరికీ ఏ డౌట్లొ లేకుండా కేంద్రం రాజముద్ర వేయనుంది అని అంటున్నారు.

    https://www.tupaki.com/latest-news/chandrababu-amaravati-capital-1397335

Comments are closed.