Advertisement

Advertisement


Home > Movies - Movie News

నితిన్ కు డిసైడింగ్ మూవీ ‘మాచర్ల’

నితిన్ కు డిసైడింగ్ మూవీ ‘మాచర్ల’

టాలీవుడ్ లో ప్రతి హీరోకి ఒకటే కామన్ కోరిక…మాస్ సినిమా చేయాలని. కానీ మాస్ సినిమాలతో అందరి హీరోలు సక్సెస్ లు అందుకున్నది తక్కువు. నితిన్ తన కెరీర్ ప్రారంభంలో ఎన్ని మాస్ సినిమాలు చేసాడో లెక్కలేదు. దాదాపు అన్నీ భారీ సినిమాలే. టాప్ డైరక్టర్లే.  

ఫార్ములా సినిమాలే. కానీ అవేవీ ఇవ్వని సక్సెస్ ను ఇష్క్ ఇచ్చింది. ఒక్కసారికి నితిన్ కెరీర్ ను కొత్తగా చూపించింది. లవ్..ఫన్..అన్నీ కలిసి నితిన్ ను ఇక ఆ దిశగా నడిపించింది. అ..ఆ మరో మెట్టు ఎక్కించింది. గుండె జారి గల్లంతయ్యిందే, చినదాన నీకోసం, రంగ్ దే సినిమాలు కూడా ఓకె సినిమాలే కానీ..నెగిటివ్ రిజల్ట్ కాదు. భీష్మ మంచి హిట్. ఇవన్నీ యూత్ ఫుల్  లవ్..రొమాంటిక్ సినిమాలే.

మధ్యలో చేసిన లై, హార్ట్ ఎటాక్, చెక్ లాంటివి మాస్ టచ్ సినిమాలు. ఇవి మాత్రం సరైన ఫలితాలు ఇవ్వలేదు. అయినా నితిన్ దృష్టి మాస్ సినిమాల మీదే వుంది. అందుకే ఇప్పుడు మాచర్ల నియోజకవర్గం సినిమా చేస్తున్నట్లు కనిపిస్తోంది. ట్రయిలర్ విడుదలయింది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమా ను రెగ్యులర్ ఫార్ములా కథతో చేసినట్లు కనిపిస్తోంది ట్రయిలర్ చూస్తుంటే. అయితే దీనికి వెన్నెల కిషోర్ అండ్ కో తో ఓ కామెడీ ట్రాక్ జోడించినట్లున్నారు.

ఈ సినిమా సక్సెస్ అయితే నితిన్ మాస్ కోరిక తీరుతుంది అంతే కాదు, ఇకపై ఇలాంటి సినిమాలు అడపా దడపా అయినా ట్రయ్ చేసుకోవచ్చు. థియేటర్లకు జనాలను రప్పించేవి ఇలాంటి మాస్ సినిమాలే అని ఇండస్ట్రీ జనాలు నమ్ముతున్నారు. అందువల్ల ఈ సినిమా కు మంచి ఓపెనింగ్ వచ్చి, పెద్ద హిట్ అయితే నితిన్ ఇక ఈ రూట్ ను ఎక్కువగా నమ్ముకోవచ్చు. అలా కాకపోతే మాత్రం ఇష్క..అ..ఆ..భీష్మ సినిమాల బాట పట్టాల్సి వుంటుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?