cloudfront

Advertisement


Home > Movies - Movie News

నితిన్-వెంకీ అట్లూరి-రంగ్ దే

నితిన్-వెంకీ అట్లూరి-రంగ్ దే

యంగ్ హీరో నితిన్ ఫుల్ పామ్ లోకి వచ్చేసాడు. ఒక సినిమా స్టార్ట్ చేసాడు. మరో సినిమా ఓపెన్ చేసాడు. ఇంకో సినిమాకు ఇప్పుడు టైటిల్ అనౌన్స్ చేయబోతున్నాడు.

వెంకీ కుడుమల-రష్మిక మడొన్నా కాంబినేషన్ లో సినిమా షూట్ ను సూపర్ ఫాస్ట్ గా చేసేస్తున్నారు. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇఫ్పటి వరకు గ్యాప్ ఇవ్వడం లేదు. 

భవ్య బ్యానర్ పై రకుల్-ప్రియా వారియర్-చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్ లో సినిమాకు ముహుర్తం చేసేసాడు. అది స్టార్ట్ చేయాల్సి వుంది.

ఇక వెంకీ అట్లూరి-సితార ఎంటర్ టైన్ మెంట్స్ కాంబినేషన్ లో సినిమా వుందన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు టైటిల్ ఇప్పుడు అనౌన్స్ చేయబోతున్నారు. రంగ్ దే అన్నది టైటిల్. ఇది ఎక్కడ నుంచి తీసుకున్నారో అందరికీ తెలిసిందే.

నితిన్ బ్లాక్ బస్టర్ హిట్ అ..ఆ సినిమాలో సూపర్ హిట్ సాంగ్ రంగ దే..రంగ్ దే..ఇప్పుడు అదే నితిన్ -వెంకీ అట్లూరి సినిమాకు టైటిల్ అయింది. 

మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు ప్రకటించి నితిన్ మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చేసాడు.

బాబుపై కేసుల విచారణకు ఇక అవరోధాలు లేవు