కేజీఎఫ్ లో ఖాన్సార్.. నిజమేనా?

ఇప్పుడంతా క్రాస్-ఓవర్ కథల ట్రెండ్ నడుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే లోకేష్ కనగరాజ్ ఓ ట్రెండ్ సెట్ చేశాడు. ప్రశాంత్ వర్మ ఆల్రెడీ అదే దారిలో నడుస్తున్నాడు. మరి ప్రశాంత్ నీల్ సంగతేంటి? Advertisement…

ఇప్పుడంతా క్రాస్-ఓవర్ కథల ట్రెండ్ నడుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే లోకేష్ కనగరాజ్ ఓ ట్రెండ్ సెట్ చేశాడు. ప్రశాంత్ వర్మ ఆల్రెడీ అదే దారిలో నడుస్తున్నాడు. మరి ప్రశాంత్ నీల్ సంగతేంటి?

ప్రశాంత్ తీసిన 2 సినిమాల కలబోతతో మరో సినిమా రాబోతోందనే ప్రచారం చాన్నాళ్లుగా నడుస్తోంది. మరీ ముఖ్యంగా సలార్-2 లో కేజీఎఫ్ ప్రస్తావన ఉంటుందని.. కేజీఎఫ్ తో ఖాన్సార్ ప్రపంచాల్ని నీల్ కలపబోతున్నాడనే ప్రచారం చాన్నాళ్లుగా నడుస్తోంది.

ఎట్టకేలకు ఈ ప్రచారంపై హీరో యష్ స్పందించాడు. ఇదంతా కేవలం సోషల్ మీడియా సృష్టి అని తేల్చిపడేశాడు.

“ఇది పూర్తిగా సోషల్ మీడియా ట్రెండ్ మాత్రమే. ఈరెండు సినిమాల మధ్య ఎలాంటి క్రాస్-ఓవర్ కథ ఉండదు. కేజీఎఫ్, సలార్ ఫ్రాంచైజీలు వేటికవే డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తాయి.”

ఈ సందర్భంగా మరో బ్రేకింగ్ న్యూస్ కూడా బయటపెట్టాడు యష్. కేజీఎఫ్ ఫ్రాంచైజీకి పార్ట్-3 కూడా ఉందని ప్రకటించాడు. పార్ట్-2లో హీరో ప్రయాణిస్తున్న నౌకపై బాంబు దాడి జరిగి సముద్రంలో మునిగిపోతాడు. కానీ అతడు బయటపడతాడు.

నాలుగేళ్ల తర్వాత తిరిగొస్తాడు. ఆ నాలుగేళ్లు అతడు ఎక్కడున్నాడు, ఏం చేశాడనే అంశాలతో పాటు మరిన్ని ఎక్సయిటింగ్ ఎలిమెంట్స్ తో పార్ట్-3 వస్తుందని, ప్రశాంత్ నీల్ తో తను రెగ్యులర్ గా దీనిపై చర్చలు సాగిస్తూనే ఉన్నానని ప్రకటించాడు యష్.

2 Replies to “కేజీఎఫ్ లో ఖాన్సార్.. నిజమేనా?”

  1. ఖాన్సర్ కాదు, సముద్రం లో పడిన హీరో ఎర్ర సముద్రం లో తెలుతాడు. అక్కడ భైరా వద్ద కొన్నాళ్ళు తల దాచుకొని వర తో కలసి ధర్మ స్థలి వద్ద పాదఘట్టం వెళ్తాడు. అక్కడ నీలాంబారి ప్రేమలో పడి సేద తీరుతాడు. అక్కడే పని పాట లేకుండా తీరిగే ఆచార్య హీరో ని కోలార్ కి తీసుకుని వెళ్లడం తో పార్ట్ 3 మొదలవుతుంది.

Comments are closed.