నవంబర్ లో టాలీవుడ్ ఎట్రాక్షన్స్ ఇవే!

కరోనా వల్ల పరిస్థితులన్నీ అల్లకల్లోలం అయ్యాయి. ఏడాది ఆరంభంలో క్రాక్, ఉప్పెన.. మధ్యలో జాతిరత్నాలు, వకీల్ సాబ్, రీసెంట్ గా రాజరాజ చోర, లవ్ స్టోరీ సినిమాలు మినహాయిస్తే చెప్పుకోదగ్గ మూవీస్ ఏవీ ఈ…

కరోనా వల్ల పరిస్థితులన్నీ అల్లకల్లోలం అయ్యాయి. ఏడాది ఆరంభంలో క్రాక్, ఉప్పెన.. మధ్యలో జాతిరత్నాలు, వకీల్ సాబ్, రీసెంట్ గా రాజరాజ చోర, లవ్ స్టోరీ సినిమాలు మినహాయిస్తే చెప్పుకోదగ్గ మూవీస్ ఏవీ ఈ ఏడాది లేవు. ఇక మిగిలింది నవంబర్, డిసెంబర్ నెలలు మాత్రమే. మరి నవంబర్ లో అంచనాలు రేకెత్తిస్తున్న సినిమాలేంటి?

నవంబర్ లో ఓ మోస్తరు అంచనాలతో వస్తున్న సినిమా పెద్దన్న. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన ఈ సినిమాలో భారీ తారాగణం ఉంది. శివ దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన నయనతార నటించగా.. కీర్తిసురేష్ చెల్లెలి పాత్రలో కనిపించనుంది. మీనా, కుష్బూ, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

నవంబర్ 4న థియేటర్లలోకి రాబోతున్న పెద్దన్నతో పాటు మంచిరోజులొచ్చాయి అనే సినిమా కూడా రిలీజ్ కాబోతోంది. మారుతి డైరక్ట్ చేసిన ఈ సినిమాలో సంతోష్ శోభన్, మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా నటించారు. యూవీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్లపై వస్తున్న ఈ సినిమాపై కూడా ఓ మోస్తరు అంచనాలున్నాయి.

ఇక నవంబర్ 12న రాజా విక్రమార్క, లక్ష్య సినిమాలు రాబోతున్నాయి. కార్తికేయ హీరోగా నటించిన మూవీ రాజా విక్రమార్క. అటు నాగశౌర్య హీరోగా నటించిన సినిమా లక్ష్య. రాజా విక్రమార్క ఏజెంట్ బ్యాక్ డ్రాప్ మూవీ కాగా.. లక్ష్య స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్. 

ఈ సినిమాలతో పాటు రౌడీ బాయ్స్, రామ్ అసుర్, గుడ్ లక్ సఖి (కీర్తిసురేష్), స్కైల్యాబ్ (సత్యదేవ్) లాంటి సినిమాలు కూడా నవంబర్ లోనే థియేటర్లలోకి వస్తున్నాయి.